ఐ లవ్ యూ చెప్పలేదని.. | eight years old boy trying to murder three years old girl | Sakshi
Sakshi News home page

ఐ లవ్ యూ చెప్పలేదని..

Published Tue, Jan 13 2015 12:21 AM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

ఐ లవ్ యూ చెప్పలేదని.. - Sakshi

ఐ లవ్ యూ చెప్పలేదని..

మూడేళ్ల చిన్నారిపై ఎనిమిదేళ్ల బాలుడి హత్యాయత్నం

మదనపల్లె: మూడేళ్ల బాలిక ‘ఐ లవ్ యూ’ అని చెప్పలేదని ఎనిమిది సంవత్సరాల బాలుడు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. స్థానిక కాలనీలో కూలి పనులు చేసుకుంటూ ఓ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఈ కుటుంబానికి చెందిన మూడేళ్ల బాలిక తనకు ఐ లవ్ యూ చెప్పలేదని పక్కనే నివాసముంటున్న ఎనిదేళ్ల బాలుడు (3వ తరగతి విద్యార్థి) ఆగ్రహించాడు.

ఇంటికి సమీపంలోకి తీసుకెళ్లి ఐ లవ్ యూ చెప్పాలని వేధించాడు. ఎంతకీ ఆ బాలిక చెప్పకపోవడంతో తాడుతో గొంతుకు ఉరేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని ఆ బాలుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. టుటౌన్ పోలీసులు ఆ బాలుడిని స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement