నేతల లోగిళ్లలో శ్రేణుల సంబరాలు
Published Thu, Jan 2 2014 3:22 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
ఎన్నికల సంవత్సరం కావడంతో రాజకీయ నేతల ఇంట ఒకటే సందడి. నూతన సంవత్సర వేడుకలు ఎన్నికల కోలాహలాన్ని తలపించాయి. మీరే
మా ఎమ్మెల్యే.. మీరే ఎంపీ అంటూ
అనుచరుల కోలాహలంతో ఈ సంబరాలు కొత్త పుంతలు తొక్కాయి. సమైక్యాంధ్ర కోసం కట్టుబడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఇప్పటికే పలు సర్వేలు
వెల్లడించిన నేపథ్యంలో ఆ పార్టీ నేతల ఇళ్ల వద్ద నూతన సంవత్సర వేడుకలు
విజయోత్సవాలను తలపించాయి.
సాక్షి, కాకినాడ : వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి అమలాపురంలోని తన నివాసంలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. పలువురు కో ఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల కన్వీనర్లతో పాటు వందలాదిమంది నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. అమలాపురం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తన క్యాంపు ఆఫీసు వద్ద, పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కామనగరువు క్యాంపు కార్యాలయం వద్ద కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. పెదపూడి మండలం పెద్దాడలోని తన నివాసంలో ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ నేత బొడ్డు అనంత వెంకటరమణచౌదరి వేడుకల్లో పాల్గొన్నారు. రాజమండ్రిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ నివాసాల వద్ద సంబరాలు జరిగాయి.
పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ, ఆయన తనయుడు నవీన్‌కుమార్ ఇర్రిపాకలో వేడుకల్లో పాల్గొన్నారు. వేలాది మంది శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 30 వేలమందికి జ్యోతుల విందు ఏర్పాటు చేశారు. రామచంద్రపురం మండలం హసన్‌బాద్‌లో సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ నివాసంలో కొత్త సంవత్సర వేడుకలు జరిగాయి. ఉప్పలగుప్తం మండలం గోపవరంలోని తన ఇంట్లో పార్టీ కేంద్రక్రమశిక్షణా కమిటీ సభ్యుడు ఏజేవిబి మేహ శ్వరరావు వేడుకల్లో పాల్గొన్నారు. ఆలమూరులో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ర్ట కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి ఇంట్లో, కాకినాడలో సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్, వందలాదిమంది నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గొడారిగుంటలోని తన నివాసంలో వేడుకలు నిర్వహించారు. ఎల్‌బీ నగర్‌లో కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ నేత చలమలశెట్టి సునీల్ ఇంట కొత్తసంవత్సర సంబరాలు సాగాయి. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం మండలం గోపాలపురంలోని తన ఇంట్లో వేడుక నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిఠాపురంలోని పార్టీ కార్యాలయంలో వేడుకల్లో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు లింగంపర్తిలోని తన ఇంట వేడుక నిర్వహించారు. సఖినేటిపల్లి మండలం రామేశ్వరంలో జరిగిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు, రాజోలు కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు కేక్ కట్ చేశారు. మలికిపురం పార్టీ కార్యాలయంలో వేడుకల్లో రాజోలు కో ఆర్డినేటర్లు చింతలపాటి వెంకట రామరాజు మట్టా శైలజ, మత్తి జయప్రకాష్ పాల్గొన్నారు. అనపర్తిలో డాక్టర్ సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో వేడుకలు జరగ్గా, మామిడికుదురు మండలం మొగలికుదురు శ్రీసత్యసాయి భరోసా దీన జనోద్ధరణ కేంద్రంలో అనాథ చిన్నారులు, వృద్ధులతో పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు కేక్ కట్ చేయించారు.
రైతు విభాగం రాష్ర్ట కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ పాల్గొన్నారు. మరో కో ఆర్డినేటర్ విప్పర్తి వేణుగోపాల్ చిన్నారులకు పండ్లు, రొట్టెలు, వృద్ధులకు దుస్తులు పంచారు. ముమ్మిడివరం పార్టీ కార్యాలయంలో కో ఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పెన్మత్స చిట్టిరాజు, పెయ్యిల చిట్టిబాబు పాల్గొన్నారు. తుని కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ రొంగలి లక్ష్మి తమ నివాసాల వద్ద వేడుకలు నిర్వహించారు. మండపేట కో ఆర్డినేటర్ రెడ్డి వీరవెంకటసత్యప్రసాద్, కిసాన్, వాణిజ్య సెల్ జిల్లా కన్వీనర్లు రెడ్డి రాధాకృష్ణ, కర్రి పాపారాయుడు, రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, రంపచోడవరం కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ తమ నివాసాల వద్ద వేడుకలు నిర్వహించారు. గొల్లవల్లి చర్చిలో పార్టీ ఎస్సీసెల్‌జిల్లా కన్వీనర్ శెట్టిబత్తుల రాజబాబు పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు.
టీడీపీ, కాంగ్రెస్‌లో అంతంతమాత్రం...
తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన సంవత్సర వేడుకలు అంతంతమాత్రంగానే కనిపించాయి. అమలాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప ఇంటి వద్ద వేడుకలు జరిగాయి. టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తునిలో తన సోదరుడు యనమల కృష్ణుడు ఇంటి వద్ద ఘనంగా జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రుల ఇళ్ల వద్ద నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఇక కాంగ్రెస్ పార్టీలోనూ వేడుకలు అంతంత మాత్రంగా కనిపించాయి. కాకినాడలోని డీసీసీ కార్యాలయంతో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న ఆ పార్టీ కార్యాలయాల వద్ద ఎక్కడా కొత్తసంవత్సర సంబరాల జాడ లేదు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద కాస్త సందడి కనిపించినా, ఎమ్మెల్యేలు లేని చోట్ల పార్టీ నేతల ఇళ్ల వద్ద అసలు సందడే లేదు. కిర్లంపూడి మండలం వీరవరంలో మంత్రి తోట నరసింహం, రాజమండ్రిలో ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, అమలాపురంలోని క్యాంపు కార్యాలయంలో ఎంపీ జీవీ హర్షకుమార్ కొత్త సంవత్సర వేడుకల్లో
పాల్గొన్నారు.
Advertisement