ప్రచారానికి అనుమతి లేకుంటే కేసులే.. | elections code implemented in city | Sakshi
Sakshi News home page

ప్రచారానికి అనుమతి లేకుంటే కేసులే..

Published Sat, Mar 8 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM

elections code implemented in city

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించినా, అభ్యర్థిపై ఐపీసీ-17సీ సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. సార్వత్రిక, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి శుక్రవారం పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పూర్తిస్థాయిలో అమలు జరిగేలా అధికారులంతా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించా రు.

 అభ్యర్థులు, పార్టీలు నిర్వహించే సభలు ,సమావేశాలు, ర్యాలీలు ప్ర చారం నిర్వహించే ప్రతి అంశాన్ని వీడియో ద్వారా చిత్రీకరించాలన్నారు. వాహనాల్లో అక్రమంగా మద్యం, డబ్బు రవాణా కాకుండా ప్రత్యేక చర్య లు తీసుకోవాలన్నారు. కుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ప్రత్యేక గుర్తింపుకార్డులు జా రీ చేయాలన్నారు. రిటర్నింగ్ అధికారులంతా స్థానికంగా ఉండాలని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ స్టేషన్లు,  ప్రత్యేకంగా ఉంటాయన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్‌లు సందర్శించి వాటి పరిస్థితిని వెంటనే నివేదిక ద్వారా తెలియచేయాలని సూచించారు.

ఇంకా తొలగించకుండా ఉన్న పార్టీల బ్యానర్లు, హోర్డింగ్‌లు, నాయకులు ఫొటోలు, వాల్ పెయింటింగ్స్ ఉంటే తక్షణమే తొలగించాలన్నారు. వాల్ పెయింటిం గ్‌ను తొలగించడానికి అయిన ఖర్చును బాధ్యుల నుంచి వసూలు చేయాలని సూచించారు. రిటర్నింగ్ అధికారులు రూట్‌మ్యాప్ రూపొందించి పోలీసు అ ధికారులకు అందించాలన్నారు. ఎన్నికల సజావుగా నిర్వహించేందుకు, కోడ్ అమలుకు అన్ని చర్యలు తీ సుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి తెలిపారు. రిటర్నింగ్ అధికారులు నియోజకవర్గాల వారీగా రూట్‌మ్యాప్‌లను డీఎస్పీలకు అందచేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీఆర్‌వో రాజశేఖర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement