ఆళ్లగడ్డలో ఎన్నిక యథాతథం: ఈసీ వర్గాలు
హైదరాబాద్: కర్నూల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎన్నిక యథాతథంగా నిర్వహిస్తామని ఈసీ వర్గాలు వెల్లడించాయి. 1951 ప్రజా ప్రాతినిథ్య చట్టం సెక్షన్ 52 ప్రకారం యథావిధిగా ఎన్నికలు నిర్వాహిస్తామని ఎన్నికల కమిషన్ (ఈసీ) తెలిపింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పర్యటిస్తూ బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా శోభానాగిరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. తొలుత ఆళ్లగడ్డలో ఎన్నిక నిర్వహణపై సందేహాలు రేకెత్తిన నేపథ్యంలో ఈసీ వర్గాలు ఓ ప్రకటన చేసింది.