Bhooma Shobha Nagireddy
-
తుది నిర్ణయం హైకమాండ్ దే: డీసీసీ
కర్నూలు: ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో పోటీ చేయాలా వద్దా అనే నిర్ణయంపై కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని కర్నూలు డీసీసీ ప్రతినిధులు తెలిపారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని కర్నూలు డీసీసీ హైకమాండ్ కు సూచించింది. ఆళ్లగడ్డలో పోటీ చేయాలా వద్దా అనే అంశంపై మంగళవారం అధికారిక ప్రకటన వెలువడుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేత భూమా శోభానాగిరెడ్డి ఆకస్మిక మృతితో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇప్పటికే అధికార పార్టీ తెలుగుదేశం పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది. -
నవంబర్ 8న ఆళ్లగడ్డ స్థానానికి ఉప ఎన్నిక
-
నవంబర్ 8న ఆళ్లగడ్డ స్థానానికి ఉప ఎన్నిక
న్యూఢిల్లీ: వైఎస్ఆర్సీపీ నేత, దివంగత భూమా శోభానాగిరెడ్డి మృతితో ఖాళీ ఏర్పడిన ఆళ్లగడ్డ నియోజకవర్గానికి నవంబర్ 8 తేదిన ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం అక్టోబర్ 14 తేదిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఈసీ ప్రకటన చేసింది. నవంబర్ 8 తేదిన పోలింగ్ నిర్వహించి.. 12 తేదిన ఓట్ల లెక్కింపు జరుపనున్నట్టు ప్రకటనలో పేర్కోన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రోడ్డు ప్రమాదంలో భూమా శోభానాగిరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. మరణానంతరం జరిగిన ఆళ్లగడ్డ స్థానానికి జరిగిన ఎన్నికలో శోభానాగిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. -
'క్లిష్ట సమయంలో శోభానాగిరెడ్డి తోడుగా నిలబడ్డారు'
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, దివంగత ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి తనకు అక్కలాంటిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 'రాజకీయ కుటుంబంలోకి నుంచి వచ్చిన శోభానాగిరెడ్డి 27 ఏళ్ల వయస్సులోనే ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. గుంటూరు పర్యటనలో ఉండగా శోభానాగిరెడ్డి సంబంధించిన విషాదవార్తను విన్నప్పడు దిగ్బ్రాంతికి గురయ్యాను. అసెంబ్లీలో ఇలాంటి పరిస్టితుల్లో మాట్లాడవలసి వస్తుందని అనుకోలేదు. ఎన్నికల ప్రచారం సమయంలో శోభానాగిరెడ్డి మరణించడంతో భూమానాగిరెడ్డి తీవ్ర విచారంలో మునిగిపోయారు. భూమా శోభానాగిరెడ్డి పిల్లలు చాలా చిన్నవారని.. ఆ కుటుంబాన్ని చూస్తే చాలా బాధకలుగుతోంది. ఎల్లవేళలా భూమా కుటుంబానికి తోడు ఉంటాం. నాన్న చనిపోయిన తర్వాత రాజకీయంగా అంతరించిపోతామన్న మాటలు చెప్తున్నప్పుడు శోభానాగిరెడ్డి నాకు తోడుగా నిలబడ్డారు. అలాంటి వ్యక్తి గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేను కలలోకూడా అనుకోలేదు. శోభానాగిరెడ్డి భౌతికంగా మనమధ్య లేకున్నా.. ఆళ్లగడ్డ ప్రజలు ఆమెను 18వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఉప ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా... శోభమ్మపై విశ్వాసం చూపారు. శోభమ్మ ఎక్కడ ఉన్నా.. ఆత్మకు శాంతి చేకూరాలి' అని శాసనసభలో శోభానాగిరెడ్డి సంతాప తీర్మానం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. -
ఉద్వేగంతో జగన్... విజయమ్మ కంటతడి!
వైఎస్ఆర్ కాంగ్రెస్ కీలక నేత భూమా శోభానాగిరెడ్డి భౌతిక కాయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ జగన్ తోపాటు వైఎస్ విజయమ్మ, షర్మిల, భారతీలు ప్రత్యేక హెలికాఫ్టర్ లో శుక్రవారం మధ్యాహ్నం ఆళ్లగడ్డకు చేరుకున్నారు. శోభానాగిరెడ్డి భౌతికకాయం వద్దకు వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు చేరుకోగానే భూమా నాగిరెడ్డితోపాటు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు భోరున విలపించారు. భూమానాగిరెడ్డి కుటుంబ సభ్యులను చూసి వైఎస్ జగన్ ఉద్యేగానికి లోనయ్యారు. వైఎస్ విజయమ్మ, షర్మిల, భారతీ కంటనీరు పెట్టారు. శోభానాగిరెడ్డి కూతుళ్ల, కుమారుడిని అక్కున చేర్చుకుని ఓదార్చారు. భూమా నాగిరెడ్డికి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఆతర్వాత శోభానాగిరెడ్డి భౌతికకాయంపై విజయమ్మ పుష్పగుచ్చాన్ని ఉంచగా, వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఆతర్వాత అంతిమ యాత్రలో వైఎస్ జగన్ పాల్గోన్నారు. కార్యకర్తల్ని, నాయకులను, బంధువులతో మాట్లాడారు. కార్యకర్తలు, నేతల్లో ధైర్యాన్ని నింపారు. అనంతరం కుటుంబం సభ్యులతో కలిసి ఆళ్లగడ్డ నుంచి బయలుదేరారు. -
ఆళ్లగడ్డలో ఎన్నిక యథాతథం: ఈసీ వర్గాలు
హైదరాబాద్: కర్నూల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎన్నిక యథాతథంగా నిర్వహిస్తామని ఈసీ వర్గాలు వెల్లడించాయి. 1951 ప్రజా ప్రాతినిథ్య చట్టం సెక్షన్ 52 ప్రకారం యథావిధిగా ఎన్నికలు నిర్వాహిస్తామని ఎన్నికల కమిషన్ (ఈసీ) తెలిపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పర్యటిస్తూ బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా శోభానాగిరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. తొలుత ఆళ్లగడ్డలో ఎన్నిక నిర్వహణపై సందేహాలు రేకెత్తిన నేపథ్యంలో ఈసీ వర్గాలు ఓ ప్రకటన చేసింది.