ఉద్వేగంతో జగన్... విజయమ్మ కంటతడి!
వైఎస్ఆర్ కాంగ్రెస్ కీలక నేత భూమా శోభానాగిరెడ్డి భౌతిక కాయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ జగన్ తోపాటు వైఎస్ విజయమ్మ, షర్మిల, భారతీలు ప్రత్యేక హెలికాఫ్టర్ లో శుక్రవారం మధ్యాహ్నం ఆళ్లగడ్డకు చేరుకున్నారు. శోభానాగిరెడ్డి భౌతికకాయం వద్దకు వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు చేరుకోగానే భూమా నాగిరెడ్డితోపాటు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు భోరున విలపించారు.
భూమానాగిరెడ్డి కుటుంబ సభ్యులను చూసి వైఎస్ జగన్ ఉద్యేగానికి లోనయ్యారు. వైఎస్ విజయమ్మ, షర్మిల, భారతీ కంటనీరు పెట్టారు. శోభానాగిరెడ్డి కూతుళ్ల, కుమారుడిని అక్కున చేర్చుకుని ఓదార్చారు. భూమా నాగిరెడ్డికి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఆతర్వాత శోభానాగిరెడ్డి భౌతికకాయంపై విజయమ్మ పుష్పగుచ్చాన్ని ఉంచగా, వైఎస్ జగన్ నివాళులర్పించారు.
ఆతర్వాత అంతిమ యాత్రలో వైఎస్ జగన్ పాల్గోన్నారు. కార్యకర్తల్ని, నాయకులను, బంధువులతో మాట్లాడారు. కార్యకర్తలు, నేతల్లో ధైర్యాన్ని నింపారు. అనంతరం కుటుంబం సభ్యులతో కలిసి ఆళ్లగడ్డ నుంచి బయలుదేరారు.