సాక్షి, అమరావతి: విద్యుత్ లైన్లు, ప్లాంట్ల నిర్మాణానికి అడ్డగోలుగా రైతుల భూములు లాక్కోవడానికి వీల్లేకుండా రూపొందించిన జీవో ఎంఎస్–24 అమలు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ రాష్ట్ర ఇంధనశాఖ ఉత్తర్వులిచ్చింది. విద్యుత్ లైన్లు, టవర్ల కోసం చిన్న తరహా రైతులు చెట్లను, పంట పొలాలను నష్టపోతున్న విషయాన్ని గుర్తించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లోనే జీవోఎంఎస్ నం. 24 తీసుకొచ్చారు. రైతులు న్యాయంగా కోరినంత నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు.
అయితే ఆ తర్వాత పాలకులు దానిని చిత్తశుద్ధిగా అమలు చేయలేదు. దీంతో ట్రాన్స్‌కో, డిస్కమ్ ప్రాజెక్టులను రైతులు అడ్డుకుంటున్నారు. విద్యుత్ లైన్లకు అడ్డుపడుతూ విద్యుత్ సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ఏపీఈఆర్‌సీ ప్రభుత్వాన్ని కోరింది. 2007లోనే రైతులకు అనువుగా నష్టపరిహారం ఇవ్వాలనే చట్టం తీసుకొచ్చారని, అయితే దీన్ని అధికారులు అమలు చేయడం లేదని పేర్కొంది. దీనిపై స్పందించిన రాష్ట్ర ఇంధనశాఖ చట్టం అమలుకు జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించింది.
రైతు అనుమతితోనే విద్యుత్ లైన్లు
Published Thu, Mar 9 2017 1:52 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement