సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీని కమలనాథన్ కమిటీ 11 శాఖల్లో పూర్తి చేసింది. 11 శాఖల్లోని ఉద్యోగుల్లో ఏ ఉద్యోగిని ఏ రాష్ట్రానికి పంపిణీ చేశారో వివరిస్తూ ఆదివారం లేదా సోమవారం ఆదేశాలు జారీ చేయనున్నారు. పంపిణీ పూర్తి చేసిన ఉద్యోగులకు అభ్యంతరాలు తెలియజేయడానికి రెండు వారాల గడువు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది.