సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన ప్రక్రియ వేగవంతమైంది. సమాచార, పౌరసంబంధాలు, ఉద్యాన, మత్య్స, కుటుంబ, వైద్య, ఆరోగ్య శాఖలకు సంబంధించిన ఉద్యోగుల నుంచి ఆప్షన్లు నమోదు చేసేందుకు సంబంధించిన నోటిఫికేషన్లు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ శాఖల కార్యాలయాలకు, సంబంధిత ఉద్యోగుల మొబైల్ నెంబర్లకు యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లను ఎస్‌ఎంఎస్ చేశారు. 15లోగా ఈ శాఖల్లోని ఉద్యోగులు తమ ఆప్షన్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఎస్‌ఎంఎస్ రాకపోతే తమ శాఖాధిపతుల కార్యాలయాల్లో సంప్రదించాలని ఏపీ ప్రభుత్వ కార్యదర్శి, రీఆర్గనైజేషన్ అడ్వయిజరీ కమిటీ మెంబర్ సెక్రటరీ ఎల్.ప్రేమచంద్రారెడ్డి కోరారు.
పది శాఖాధిపతుల కార్యాలయాలకు సంబంధించిన ఉద్యోగుల తాత్కాలిక పంపిణీ జాబితాలు విడుదల పూర్తి చేసినట్లు తెలిపారు. మరో 86 శాఖాధిపతుల కార్యాలయాలకు సం బంధించి నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు.