రూ. 250 కోట్లతో విశాఖలో పరిశ్రమ.. 600 మందికి ఉపాధి
సాక్షి, విశాఖపట్నం: గ్రానైట్, కటింగ్, పాలిషింగ్ యూనిట్‌ను విశాఖలో ఏర్పాటుకు బెనిటా గ్రానైట్ లిమిటెడ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ. 250 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు వల్ల 600 మందికి ఉపాధి దొరుకుతుందని సంస్థ ప్రభు త్వానికి తెలిపింది. విశాఖలో జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో శనివారం బెనిటా గ్రానైట్స్ ఎండీ సతీష్ తాటి, గనుల శాఖ కార్య దర్శి బి.శ్రీధర్ ఎంవోయూపై సంతకాలు చేశారు.
మినరల్స్‌లో మన్నాతో: విశాఖ జిల్లాలో రూ. 350 కోట్ల పెట్టుబడితో మన్నా ఇండస్ట్రీస్ తమ యూని ట్‌ను ఏర్పాటు కు ప్రభుత్వంతో ఎంవోయూ కదుర్చుకుంది. క్యాల్‌సైట్, అనుబంధ మినరల్స్ ప్రాసెసింగ్ యూనిట్ వల్ల వెయ్యి మందికి ఉపా ధి లభిస్తుందని సంస్థ డైరెక్టర్ డి.కిషన్ ప్రసాద్ తెలిపారు. ఈ గ్రూప్ సంస్థల చైర్మన్ యు.కొండల రావు మాట్లాడుతూ యూనిట్ ఏర్పాటుకు, ముడి సరుకు అందజేసే లీజుదార్లకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
ప్రభుత్వంతో ‘బెనిటా గ్రానైట్స్’ ఎంవోయూ
Published Sun, Jan 29 2017 1:36 AM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM
Advertisement