అనంతపురం : అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం కత్తివారిపల్లేలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కత్తివారిపల్లేకు చెందిన వెంకటరమణ కుమారుడు జయచంద్రారెడ్డి(22) ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
సోమవారం ఉదయం జయచంద్రారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.