నగరంలోని పద్మావతి మహిళా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని స్వాతి శుక్రవారం హాస్టల్ గది ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అ విషయాన్ని తోటి విద్యార్థులు వెంటనే గ్రహించారు. వెంటనే ఆ సమాచారాన్ని హాస్టల్ యాజమాన్యానికి అందించారు. దాంతో విద్యార్థులు సహాయంతో స్వాతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే స్వాతి పరిస్థితి విషమంగా ఉండటంతో మార్గమధ్యంలో మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాతి మరణంపై ఆమె తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. అయితే స్వాతి అత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. స్వాతి పద్మావతి మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతుంది.