
'తుపాన్ ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధం'
విశాఖపట్నం: హుదూద్ తుపాన్ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరి బాబు వెల్లడించారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలలోపాటు రాజమండ్రి, ఏలూరులో 45 సెక్షన్స్లో కండెక్టర్స్,పోల్స్, ట్రాన్స్ఫార్మర్ వంటి సామాగ్రిని ఏర్పాటు చేశామని తెలిపారు. క్షేత్రస్థాయి పర్యవేక్షణకు 35 మంది సిబ్బందిని నియమించామన్నారు. సదరు సిబ్బందికి వైర్లెస్ సెట్లు, మొబైల్ ఫోన్లు అందించామన్నారు. అలాగే తీర ప్రాంత సబ్ స్టేషన్లలో దాదాపు 50 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
అన్ని సర్కిల్స్ కార్యాలయాల్లో 1000 మంది స్కిల్డ్, అన్ స్కిల్డ్ సిబ్బంది సిద్దంగా ఉన్నారని చెప్పారు. ఐదు జిల్లాల పరిధిలో ఆరు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్లను ఆయన వివరించారు. విశాఖపట్నంలోని కార్పొరేట్ ఆఫీస్ : 8331018762, విశాఖపట్నం: 0891 2582392, 7382299975, విజయనగరం : 94906101102, శ్రీకాకుళం 9490612633, తూర్పు గోదావరి : 7382299960, పశ్చిమగోదావరి : 9440902926.