Seshagiri Babu
-
ప్రతిభ కలిగిన విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో సన్మానం
-
ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2021–22 విద్యాసంవత్సరపు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడి యెట్ బోర్డు ఏర్పాట్లు చేపట్టింది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నామని బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు చెప్పారు. ఆయన సోమవారం ‘సాక్షితో మాట్లాడారు. ఇతర పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు ఒకేరోజున రాకుండా ఉండేలా షెడ్యూల్ రూపొందిస్తామన్నారు. కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ పరీక్షలు నిర్వహిస్తామని, పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు, ఇతర అవసరాలకోసం జిల్లాలకు నిధులు మంజూరు చేశామని వివరించారు. విద్యార్థుల కోసం సబ్జెక్టుల కంటెంట్ సిద్ధం కోవిడ్ కారణంగా 2021– 22 విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావ డం, ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు వీలుకాకపోవడం వంటి కారణాలతో ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించిన సంగతి తెలిసిందే. తక్కిన 70 శాతం సిలబస్‌ను విద్యార్థులకు బోధించినందున ఆ మేరకు పబ్లిక్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కు ఉపయోగపడేలా కంటెంట్ రూపొందించామని, త్వరలో విద్యార్థులకు అందుబాటులో ఉంచుతా మని శేషగిరిబాబు చెప్పారు. ఈ మెటీరియల్ ఇం టర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకే కాకుండా జాయిం ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, అడ్వా న్స్, నీట్, ఏపీఈఏపీసెట్ వంటి వాటికి కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. పకడ్బందీగా ప్రాక్టికల్స్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను మార్చిలో పకడ్బందీగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్న ట్లు శేషగిరిబాబు చెప్పారు. ప్రాక్టికల్ పరీక్షలకు సం బంధించి విద్యార్థులకు జంబ్లింగ్ ఉండదని, ఎగ్జామినర్లను జంబ్లింగ్ విధానంలో నియమించనున్న ట్లు చెప్పారు. ఫిబ్రవరిలో ఇంటర్మీడియట్ ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సిలబస్‌పై నిపుణులతో అధ్యయనం మారుతున్న కాలానికి అనుగుణంగా, పరిశ్రమలు, వివిధ సంస్థలు, పారిశ్రామిక అవసరాలు, అంతర్జాతీయంగా ఆయా రంగాల్లో వస్తున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులను అందుకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందని శేషగిరి బాబు పేర్కొన్నారు. ఈ దిశగా ఇంటర్మీడియట్ బోర్డులోని ఎడ్యుకేషన్ రీసెర్చి ట్రయినింగ్ వింగ్ (ఈఆర్టీడబ్ల్యూ)ను బలోపేతం చేస్తున్నట్లు తెలి పారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ సిలబస్‌లో మార్పులు చేర్పులకు సంబంధించి అధ్యయనం, సిఫా ర్సుల కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో ఉన్నత విద్యామండలి ప్రతినిధులు, ఐఐటీల ప్రొఫెసర్లు, ఎన్సీఈఆర్టీ ప్రముఖులు, ఈఆర్టీడబ్ల్యూ ప్రతినిధులు ఉన్నారని చెప్పారు. జనరల్ కోర్సులతో పాటు వొకేషనల్ కోర్సులకు సంబంధించిన అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేస్తున్న కమిటీ.. విద్యార్థుల భవి ష్యత్తును దృష్టిలో పెట్టుకుని సిలబస్‌లో మార్పులు చేర్పులకు సిఫార్సులు చేస్తుందని వివరించారు -
ఏపీలోని 17 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవకతవకలు: రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ
అమరావతి: ఏపీలోని17 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలానాల అవకతవకలు జరిగినట్లు గుర్తించామని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషగిరిబాబు తెలిపారు.10 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.5.25 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించామని శేషగిరిబాబు వెల్లడించారు. ఇప్పటికే రూ.కోటి రికవరీ చేశామని, అవకతవకలపై ఆరుగురు సబ్రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశామని అన్నారు. మిగతా సబ్రిజిస్ట్రార్లపై విచారణ జరుగుతోందన్నారు. అవకతవకలు జరిగిన చోట్ల కేసులు నమోదు చేయిస్తున్నామని ఐజీ శేషగిరిబాబు అన్నారు. 2021 ఏప్రిల్ నుంచి జులై వరకు 54 నకిలీ చలానాలు గుర్తించినట్లు తెలిపారు. నకిలీ చలానాలతో రూ.7లక్షల మేర గోల్మాల్ జరిగినట్టు నిర్ధారించారు. చలానాల గోల్‌మాల్‌లో డాక్యుమెంట్ రైటర్ల పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పొన్నూరు, భీమవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీలు చేపట్టింది. కాగా తణుకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, రూ.54,100 అనధికార నగదు స్వాధీనం చేసుకున్నారు. -
మరింత కఠినంగా లాక్డౌన్ అమలు
-
కరోనా అలర్ట్: స్కూళ్లకు సెలవులు
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నెల 6న ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. దీంతో జిల్లాలో హై అలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు కృష్ణపట్నం పోర్టు, శ్రీహరికోట రాకెట్ కేంద్రాలను అప్రమత్తం చేసింది. శుక్రవారం జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలలకు 18 వరకు సెలవులు ప్రకటించారు. స్విమ్మింగ్‌పూల్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నగరంలో సినిమా హాళ్లు మూసివేసినట్లు వెల్లడించారు.(ఆర్మీ జవాన్‌కు కరోనా పాజిటివ్) మాల్స్‌ను పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు ఎక్కువగా గుమిగూడవద్దని సూచించారు. వైద్యశాఖ పరిశీలనలో 150 మంది కరోనా అనుమానితులుండగా ఐసోలేషన్ వార్డులో 9 మందికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. రెండు ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో ఈ చికిత్స అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సూళ్లూరుపేటలో ముగ్గురు కరోనా అనుమానితులను గుర్తించగా వెంటనే వారిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. (ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు) -
అశ్రునయనాలతో మిరియాల అంత్యక్రియలు
పెదవాల్తేరు (విశాఖపట్నం): కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకట్రావు భౌతికకాయానికి అశేష అభిమానులు, రాజకీయ ప్రముఖుల అశ్రునయనాల మధ్య సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మిరియాల భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి సోమవారం తెల్లవారుజామున విశాఖ చైతన్య నగర్‌లోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి కేఆర్ఎం కాలనీలోని హిందూ శ్మశాన వాటికవరకు భారీ సంఖ్యలో అభిమానులు వెంటరాగా అంతిమయాత్ర సాగింది. మిరియాల భౌతికకాయానికి ఆయన కుమారుడు, ఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరిబాబు దహన సంస్కారాలు నిర్వహిం చారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, రాజకీయనాయుకులు, ఉన్నతాధికారులు, కాపు సంఘం నాయకులు ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. వెంకట్రావుకు సీఎం నివాళులు మిరియాల వెంకట్రావుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం నివాళులర్పించారు. జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి మధ్యాహ్నం మిరియాల వెంకట్రావు నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. మిరియాల కుమారుడు శేషగిరిబాబును, కుటుంబ సభ్యులను ఓదార్చారు. వెంకట్రావు గొప్ప సేవాతత్పురుడని, పేదలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని అభివర్ణించారు. -
'తుపాన్ ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధం'
విశాఖపట్నం: హుదూద్ తుపాన్‌ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరి బాబు వెల్లడించారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలలోపాటు రాజమండ్రి, ఏలూరులో 45 సెక్షన్స్‌లో కండెక్టర్స్,పోల్స్, ట్రాన్స్ఫార్మర్ వంటి సామాగ్రిని ఏర్పాటు చేశామని తెలిపారు. క్షేత్రస్థాయి పర్యవేక్షణకు 35 మంది సిబ్బందిని నియమించామన్నారు. సదరు సిబ్బందికి వైర్లెస్ సెట్లు, మొబైల్ ఫోన్లు అందించామన్నారు. అలాగే తీర ప్రాంత సబ్ స్టేషన్లలో దాదాపు 50 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అన్ని సర్కిల్స్ కార్యాలయాల్లో 1000 మంది స్కిల్డ్, అన్ స్కిల్డ్ సిబ్బంది సిద్దంగా ఉన్నారని చెప్పారు. ఐదు జిల్లాల పరిధిలో ఆరు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్లను ఆయన వివరించారు. విశాఖపట్నంలోని కార్పొరేట్ ఆఫీస్ : 8331018762, విశాఖపట్నం: 0891 2582392, 7382299975, విజయనగరం : 94906101102, శ్రీకాకుళం 9490612633, తూర్పు గోదావరి : 7382299960, పశ్చిమగోదావరి : 9440902926. -
ఉద్యోగం అక్కడ.. జీతం ఇక్కడ
సాక్షి, ఏలూరు : విద్యుత్ శాఖలో అక్రమార్కులకు సంఖ్య పెరిగిపోతోంది. ఆ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్ వ్యవహారం తాజాగా కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి వివరాలు వెల్లడించేందుకు అధికారులెవరూ అంగీకరిచకపోవడం అనుమానాలకు తావిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఏలూరు డివిజన్ పరిధిలోని డి4 సెక్షన్లో లైన్ ఇన్స్పెక్టర్ అయిన రాజు సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచీ విధులకు హాజరుకావడం లేదు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఓ ప్రజాప్రతినిధికి అనుచరుడిగా వెళ్లిపోయి ఎన్నికల ప్రచారంలో ఆయన వెంటే ఉన్నారు. ఎన్నికల అనంతరం కూడా విధులకు హాజరుకావడం లేదు. కానీ ఇక్కడ మాత్రం జీతం తీసుకుంటున్నారు. అతను విధులకు రాకపోయినా హాజరవుతున్నట్లుగా రికార్డుల్లో రాసేస్తున్నట్లు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సీఎండీ ఎంవీ శేషగిరిబాబు ఆదేశాల మేరకు విచారణాధికారి పి.కొండాలు బుధవారం జిల్లాకు వచ్చి డి4 సెక్షన్లో విచారణ నిర్వహించారు. రికార్డులు తనిఖీ చేశారు. ఫిర్యాదు వాస్తవమేనని తేలినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ప్రజాప్రతినిధి ఒత్తిళ్లు ఉండటంతో పాటు తమ లోపాలు బయటపడతాయనే ఉద్దేశంతో ఇక్కడి అధికారులెవరూ నోరు మెదపడం లేదు. ఏలూరు నగర ఏడీఈ అంబేద్కర్‌ను ఫోన్ ద్వారా వివరణ కోరగా తాను వేరే ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పి తప్పించుకున్నారు. కొండాలును సంప్రదించగా.. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని, తదుపరి నిర్ణయం సీఎండీ తీసుకుంటారని పేర్కొన్నారు. -
అధికారులకు ఈపీడీసీఎల్ షాక్
సాక్షి, రాజమండ్రి : ఆరునూరైనా ఆదాయాన్ని స్థిరీకరించుకోవాలని చూస్తున్న తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) కఠినచర్యలకు ఉపక్రమిస్తోంది. ఇందులో భాగంగానే రాజమండ్రి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ యలమంచిలి శ్రీమన్నారాయణ ప్రసాద్, విజిలెన్స్ విభాగం డీఈ రాజబాబుల బదిలీలు జరిగాయని ఆ సంస్థ వర్గాలు అంటున్నాయి. గురువారం సాయంత్రం హడావిడిగా జరిగిన ఈ బదిలీలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరిబాబు ఆదేశాల మేరకు జనవరి మొదటి వారంలో జిల్లాలో హెచ్‌టీ వినియోగదారులపై విజిలెన్స్ దాడులు జరిగాయి. ఇప్పటి వరకూ ఎల్టీ రంగానికే పరిమితమైన దాడులు ఉన్నట్టుండి హెచ్‌టీ రంగానికి విస్తరించడం సంచలనం కలిగించింది. కాగా ఈ వినియోగంలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఫిర్యాదుల మేరకు నేరుగా విశాఖలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయం రంగంలోకి దిగి ఁఆపరేషన్ హెచ్‌టీ* ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ దాడుల పర్యవసానంగానే ఈ ఇద్దరు అధికారులను బదిలీ చేసినట్టు సమాచారం. హెచ్‌టీ కనెక్షన్లపై వరుస తనిఖీలు గత ఏడాది ఏప్రిల్‌లో అనపర్తి ఏడీఈ పరిధిలోని రాయవరం మండలం పసలపూడిలో ఓ హెచ్‌టీ కనెక్షన్ అసెస్మెంట్లో కనెక్షన్ మంజూరుకు రూ.1.08 కోట్లు చార్జి చేయాల్సి ఉండగా రూ.28 లక్షలు తక్కువగా కట్టించుకున్న అభియోగంపై అక్కడి ఏడీఈని ఇటీవలే శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేశారు. అప్పటికే సీఎండీ ఆదేశాల మేరకు డిసెంబరు 28న రాత్రి రాయవరం మండలంలోని ఓ రైస్ మిల్లుపై జరిపిన దాడిలో మిల్లు నిర్వాహకులు మీటర్‌ను ట్యాంపర్ చేసి విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్నట్టు గుర్తించి, రూ.68 లక్షల అపరాధ రుసుం విధించారు. అనంతరం హెచ్‌టీ సర్వీసులపై వరుసగా పది రోజులు జరిపిన తనిఖీల్లో అధిక శాతం అనుమతికి మించిన విద్యుత్తును వినియోగిస్తున్న వైనం వెలుగు చూసింది. ఇదంతా అధికారుల పర్యవేక్షణా లోపంగా పరిగణించినందునే సీఎండీ కఠినచర్యలకు పూనుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పాత కేసును కూడా పరిగణనలోకి తీసుకుని ఎస్ఈకి కూడా తెలియకుండానే అనపర్తి ఏడీఈని బదిలీ చేసినట్టు సమాచారం. ఇదే క్రమంలో ఎస్ఈ ప్రసాద్‌ను విశాఖపట్నం కార్పొరేట్ కార్యాలయంలో ఆపరేషన్స్ విభాగం జనరల్ మేనేజర్‌గా బదిలీ చేశారు. విశాఖ డీపీఈ విభాగంలో డీఈగా ఉన్న గంగాధర్‌ను పదోన్నతిపై రాజమండ్రి ఎస్ఈగా నియమించారు. రాజమండ్రి డీపీఈ విభాగం డీఈని విజయనగరంలో కన్స్ట్రక్షన్ విభాగానికి బదిలీ చేసి కొత్తగా పదోన్నతి పొందిన పాడేరు ఏడీఈ రాంబాబును రాజమండ్రి డీపీఈ డీఈగా నియమించారు. ఎస్ఈ ప్రసాద్ 2012 జూలై 12న రాజమండ్రి సర్కిల్లో బాధ్యతలు స్వీకరించారు. కాగా బదిలీపై ఆయనను వివరణ కోరగా ప్రమోషన్లలో జూనియర్లకు అవకాశం కల్పించడంలో భాగంగా తమ బదిలీలు జరిగినట్టు చెప్పారు. -
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చేతులెత్తిన ఈపీడీసీఎల్ సీఎండీ
-
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చేతులెత్తిన ఈపీడీసీఎల్ సీఎండీ
విశాఖ : విద్యుత్ ఉద్యోగులతో ఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరిబాబు సోమవారం జరిగిపన చర్చలు విఫలం అయ్యాయి. సమ్మె కొనసాగిస్తామని విద్యుత్ జేఏసీ స్పష్టం చేసింది. దాంతో ప్రత్యమ్నాయ ఏర్పాట్లపై సీఎండీ చేతులెత్తేశారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు ప్రారంభించిన సమ్మె ప్రభావం తీవ్ర రూపం దాల్చటంతో ఫలితంగా అటు పరిశ్రమకు, ఇటు గృహ, వాణిజ్యావసరాలకు కూడా విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. ఈపీడీసీఎల్ పరిధిలో రోజుకు 1500 నుంచి 1700 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా ఇప్పుడు రోజుకు 1215 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతోంది. బంద్ కారణంగా డిమాండ్ కొద్దిగా తగ్గినప్పటికీ నిన్నటి నుంచి అధికారులు ముందు జాగ్రత్త చర్యగా అనధికారిక కోతలకు తెరలేపారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 నుంచి 4 గంటలు, పట్టణ ప్రాంతాల్లో సైతం గంట నుంచి రెండు గంటల పాటు కోతలు విధిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో సమ్మె తీవ్ర రూపం దాల్చి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతే ఈ ప్రభావం తమ మీద కూడా ఉంటుందని ఈపీడీసీఎల్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 5వేల మందికి పైగా ఉద్యోగులు, అధికారులు ఆదివారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. ఈరోజు నుంచి పూర్తిస్థాయిలో 7,500 మంది సమ్మెలోకి వెళ్లటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే పరిస్థితి కూడా లేక ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు.