విశాఖ : విద్యుత్ ఉద్యోగులతో ఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరిబాబు సోమవారం జరిగిపన చర్చలు విఫలం అయ్యాయి. సమ్మె కొనసాగిస్తామని విద్యుత్ జేఏసీ స్పష్టం చేసింది. దాంతో ప్రత్యమ్నాయ ఏర్పాట్లపై సీఎండీ చేతులెత్తేశారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు ప్రారంభించిన సమ్మె ప్రభావం తీవ్ర రూపం దాల్చటంతో ఫలితంగా అటు పరిశ్రమకు, ఇటు గృహ, వాణిజ్యావసరాలకు కూడా విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి.
ఈపీడీసీఎల్ పరిధిలో రోజుకు 1500 నుంచి 1700 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా ఇప్పుడు రోజుకు 1215 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతోంది. బంద్ కారణంగా డిమాండ్ కొద్దిగా తగ్గినప్పటికీ నిన్నటి నుంచి అధికారులు ముందు జాగ్రత్త చర్యగా అనధికారిక కోతలకు తెరలేపారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 నుంచి 4 గంటలు, పట్టణ ప్రాంతాల్లో సైతం గంట నుంచి రెండు గంటల పాటు కోతలు విధిస్తున్నారు.
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో సమ్మె తీవ్ర రూపం దాల్చి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతే ఈ ప్రభావం తమ మీద కూడా ఉంటుందని ఈపీడీసీఎల్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 5వేల మందికి పైగా ఉద్యోగులు, అధికారులు ఆదివారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. ఈరోజు నుంచి పూర్తిస్థాయిలో 7,500 మంది సమ్మెలోకి వెళ్లటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే పరిస్థితి కూడా లేక ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చేతులెత్తిన ఈపీడీసీఎల్ సీఎండీ
Published Mon, Oct 7 2013 12:57 PM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM
Advertisement
Advertisement