అశ్రునయనాలతో మిరియాల అంత్యక్రియలు | miriyala venkata rao funerals | Sakshi
Sakshi News home page

అశ్రునయనాలతో మిరియాల అంత్యక్రియలు

Published Tue, Nov 11 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

అశ్రునయనాలతో మిరియాల అంత్యక్రియలు

అశ్రునయనాలతో మిరియాల అంత్యక్రియలు

పెదవాల్తేరు (విశాఖపట్నం): కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకట్రావు భౌతికకాయానికి అశేష అభిమానులు, రాజకీయ ప్రముఖుల అశ్రునయనాల మధ్య సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మిరియాల భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి సోమవారం తెల్లవారుజామున విశాఖ చైతన్య నగర్‌లోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు.
 
 అక్కడి నుంచి కేఆర్‌ఎం కాలనీలోని హిందూ శ్మశాన వాటికవరకు భారీ సంఖ్యలో అభిమానులు వెంటరాగా అంతిమయాత్ర సాగింది. మిరియాల భౌతికకాయానికి ఆయన కుమారుడు, ఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరిబాబు దహన సంస్కారాలు నిర్వహిం చారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో  ప్రజాప్రతినిధులు, రాజకీయనాయుకులు, ఉన్నతాధికారులు, కాపు సంఘం నాయకులు ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.
 
 వెంకట్రావుకు సీఎం నివాళులు
 మిరియాల వెంకట్రావుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం నివాళులర్పించారు. జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి మధ్యాహ్నం మిరియాల వెంకట్రావు నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. మిరియాల కుమారుడు శేషగిరిబాబును, కుటుంబ సభ్యులను ఓదార్చారు. వెంకట్రావు గొప్ప సేవాతత్పురుడని, పేదలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని అభివర్ణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement