EPDCL employees
-
విద్యుత్ శాఖలో బదిలీల రాజకీయం
- వర్గాలుగా విడిపోయిన ‘ఈపీడీసీఎల్’ ఉద్యోగులు - నిబంధనలు మార్చిన సీఎండీ ముత్యాలరాజు - హైదరాబాద్‌కు పంచాయతీ సాక్షి,విశాఖపట్నం: ఈపీడీసీఎల్ ఉద్యోగుల బదిలీల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. యూనియన్లు ఒకరిపై మరొకరు రాజకీయాలు చేసుకుంటున్నారు. బదిలీల నిబంధనల్లో సంస్థ సీఎండీ ఆర్.ముత్యాలరాజు చేసిన మార్పులు భారీ వివాదానికి దారితీశాయి. హైదరాబాద్ వెళ్లి తన నిర్ణయాన్ని ఉన్నతాధికారులకు ముత్యాలరాజు స్పష్టం చేసొచ్చారు. ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయానంద్‌ను పలువురు యూనియన్ నాయకులు కలవడంతో శుక్రవారం కూడా మరోసారి చర్చించాలని నిర్ణయించారు. రాత్రి వరకూ ఎలాంటి మార్పులు జరగలేదు. ఈపీడీసీఎల్పరిధిలో 7800 మంది ఉద్యోగులున్నాయి. నిబంధనల ప్రకారం 3 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వాళ్లు, 5ఏళ్లు ఒకే ప్రాంతంలో ఉన్న వాళ్లను బదిలీ చేయాలి. వీటి ప్రకారం 1500 మందికి సాధారణ బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఈనెల 13వ తేదీన ఈపీడీసీఎల్ సీఎండీ ఆర్ ముత్యాలరాజు పలు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు బదిలీ నిబంధనల్లో కొన్ని మార్పులు చేశారు. దాని ప్రకారం స్టేషన్ సీనియారిటీని ప్రాతిపధికగా తీసుకోవాలనుకున్నారు. విశాఖలో కొన్నేళ్లు పనిచేసి మధ్యలో శ్రీకాకుళం వెళ్లి అక్కడ కొన్నేళ్లు పనిచేసి తిరిగి విశాఖ వచ్చి ఇప్పుడు విశాఖలో పనిచేస్తుంటే ఆ ఉద్యోగి గతంలోనూ పనిచేసిన కాలాన్ని ప్రస్తుత కాలాన్ని కలిపి లెక్కిస్తారు. ఉద్యోగుల్లో విభజన తమలో ఎవరికి కష్టం వచ్చినా ఏక తాటిపైకి వచ్చి యాజమాన్యంతో పోరాడే విద్యుత్ యూనియన్లు బదిలీల నిబంధనలపై అనుకూల వ్యతిరేఖ వర్గాలుగా చీలిపోయాయి. నిబంధనల మార్పు సరికాదని కొందరు ఉద్యోగులు అంటున్నారు. జిల్లా దాటివెళ్లిన ఆరు నెలలకు పాత సర్వీసు పోతుందని, ఎక్కడ పనిచేస్తుంటే అక్కడి సర్వీసు మొదలవుతుందని ఈ లెక్కన పాత సర్వీసును ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సీఎండీ నిర్ణయమే సరైనదని, దానివల్ల గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఎన్నో ఏళ్లుగా ఉండిపోతున్న వారికి నగరాలు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే అవకాశం వస్తుందని మరికొంతమంది ఉద్యోగులు చెబుతున్నారు. 5 ఏళ్లు ఒకే ప్రాంతంలో పనిచేసిన వారు 360 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వీరిలో ఎక్కువ సంవత్సరాలు సర్వీసు ఒకే చోట ఎవరికి ఉందో చూస్తారు. ఉద్యోగుల్లో 20 శాతం మందిని లెక్కించి వారిలో ఎక్కువ సర్వీసు ఉన్నవారిని బదిలీ చేస్తారు. అందులోనూ యూనియన్ నాయకులకు మినహాయింపు ఇచ్చారు. మరి కొందరికి, ముఖ్యంగా విశాఖ సిటీలో పనిచేస్తున్న వారిని కూడా ఈ నిబంధన నుంచి తప్పించాలని యూనియన్లు కోరుతున్నాయి. -
'తుపాన్ ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధం'
విశాఖపట్నం: హుదూద్ తుపాన్‌ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరి బాబు వెల్లడించారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలలోపాటు రాజమండ్రి, ఏలూరులో 45 సెక్షన్స్‌లో కండెక్టర్స్,పోల్స్, ట్రాన్స్ఫార్మర్ వంటి సామాగ్రిని ఏర్పాటు చేశామని తెలిపారు. క్షేత్రస్థాయి పర్యవేక్షణకు 35 మంది సిబ్బందిని నియమించామన్నారు. సదరు సిబ్బందికి వైర్లెస్ సెట్లు, మొబైల్ ఫోన్లు అందించామన్నారు. అలాగే తీర ప్రాంత సబ్ స్టేషన్లలో దాదాపు 50 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అన్ని సర్కిల్స్ కార్యాలయాల్లో 1000 మంది స్కిల్డ్, అన్ స్కిల్డ్ సిబ్బంది సిద్దంగా ఉన్నారని చెప్పారు. ఐదు జిల్లాల పరిధిలో ఆరు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్లను ఆయన వివరించారు. విశాఖపట్నంలోని కార్పొరేట్ ఆఫీస్ : 8331018762, విశాఖపట్నం: 0891 2582392, 7382299975, విజయనగరం : 94906101102, శ్రీకాకుళం 9490612633, తూర్పు గోదావరి : 7382299960, పశ్చిమగోదావరి : 9440902926.