సాక్షి, కృష్ణా: అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా రాష్ట్ర విద్యా ప్రణాళికను రూపొందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ..ఇంగ్లీష్ తో పాటు తెలుగుభాషకు సముచిత ప్రాధాన్యం ఇస్తామని మరోసారి మంత్రి స్పష్టం చేసారు. ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షకు సురేష్ హాజరయ్యారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే అంశం పై కూలంకుష చర్చ జరిగిందని చెప్పారు.
పేద విద్యార్థులకు మెరుగైన విద్యాప్రమాణాలు అందిస్తామని స్పష్టం చేశారు. అభ్యాసన ఫలితాలు, ఫౌండేషనల్ లెర్నింగ్ ఆధారంగా పాఠ్య పుస్తకాలు రూపొందించబడుతున్నాయని తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన చేసేందుకు ఉపాధ్యాయులకు మూడు స్థాయిలలో శిక్షణ ఇప్పిస్తామన్నారు. బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించేందుకు ఆన్ లైన్ సేవలు వినియోగిస్తామన్నారు. పాఠశాలల్లో లాంగ్వేజ్ లేబరేటరీలు ఏర్పాటు చేసి ఇంగ్లీష్ భాషా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి జరుగుతోందని ఆదిములపు సురేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment