ఏలూరు : ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఎట్టకేలకు కసరత్తు మొదలైంది. ఈ విషయమై జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో స్థానిక జెడ్పీ అతిథి గృహంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. మంగళవారం రాత్రే జిల్లాకు చేరుకున్న ఆయన బదిలీల ప్రక్రియపై మంతనాలు సాగించారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫా ర్సు లేఖలు అందుకున్నారు. సిఫార్సు లేఖలతో అధికారులు, ఉద్యోగులు అటూఇటూ తిరగడం కనిపిం చింది. ప్రజాప్రతినిధులతో సమీక్ష అనంతరం అయ్యన్నపాత్రుడు విలేకరులతో మాట్లాడారు.
బదిలీల ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి నిబంధనల ప్రకా రం పూర్తి చేస్తామని చెప్పారు. 20 రోజుల క్రితమే బదిలీలు చే యాల్సి ఉందని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా ఈ పక్రియ వాయిదా పడిందన్నారు. ఒకేచోట మూడేళ్ల సర్వీసు దాటిన అధికారులు, ఉద్యోగులను బదిలీ చేసి తీరతామన్నారు. గుండె, కిడ్నీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మినహా యింపు ఉంటుందన్నారు. బదిలీల విషయంలో లక్షల్లో ముడుపులు చేతుల మారడమనేది ఉండదని, కొన్ని స్థానాలు కోరుకున్న అధికారులు వాటి కోసం ముడుపులు ఇచ్చి ఉండవచ్చని వ్యాఖ్యానించారు. పొరపాట్లు జరగకుండా బదిలీలు చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫార్సులు, ఒత్తిడులు తమపై ఉంటాయని, ఆ మేరకు బదిలీలు చేయక తప్పదని మంత్రి స్పష్టం చేశారు. నివాసిత మండలంలో పనిచేసే పంచాయతీ కార్యదర్శులను పక్క మండలాలకు బదిలీ చేస్తామన్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో దేవాదాయ, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, వైద్య, ఆరోగ్య శాఖల్లో బదిలీలు ఉండవన్నారు. పుష్కరాల తర్వాత ఆ శాఖల వారిని బదిలీ చేస్తామని చెప్పారు.
నిట్ జిల్లా దాటిపోదు
నిట్ ఎట్టి పరిస్థితుల్లో జిల్లానుంచి దాటిపోదని మంత్రి పేర్కొన్నారు. ఎయిర్ పోర్టును ఖాళీ స్థలంలో ఏర్పాటు చేయాలా, మరో ప్రాంతంలోనా అనేది యంత్రాంగం నిర్ణయిస్తుందన్నారు. దానికి భారీ ఎత్తున స్థలం కావాల్సి ఉందన్నారు.
నెలాఖరుకు పుష్కర పనులు పూర్తి
జిల్లాలో పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల ద్వారా చేపట్టిన పుష్కర పనులను నెలాఖరులోగా పూర్తిచేస్తామని అయ్యన్నపాత్రుడు చెప్పారు. పుష్కర ఘాట్ల వద్ద మొబైల్ మరుగుదొడ్ల ఏర్పాటును జూలై 10లోగా పూర్తిచేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. వృద్ధులు, వికలాంగులు పుష్కర స్నానాలకు ఇబ్బంది పడకుండా ఘాట్లవద్ల ప్రత్యేకంగా షవర్ బాత్‌లు నెలకొల్పుతామన్నారు. సమావేశ ంలో రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌రావు, జెడ్పీ చైర్మర్ ముళ్లపూడి బాపిరాజు పాల్గొన్నారు.
బదిలీలపై కసరత్తు
Published Thu, Jun 25 2015 3:07 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM
Advertisement
Advertisement