ఎక్కడెక్కడివారినో ఫేస్‌బుక్ స్నేహితులుగా కలిపింది. సరదా కబుర్లతో కాలక్షేపం చేయకుండా ఎదుటివారికి సాయపడేలా ఆ స్నేహితులు నిర్ణయించుకున్నారు.
ఫేస్‌బుక్ స్నేహం..చేసింది సాయం
Nov 15 2013 1:08 AM | Updated on Jul 26 2018 5:21 PM
అమలాపురం రూరల్, న్యూస్‌లైన్ : ఎక్కడెక్కడివారినో ఫేస్‌బుక్ స్నేహితులుగా కలిపింది. సరదా కబుర్లతో కాలక్షేపం చేయకుండా ఎదుటివారికి సాయపడేలా ఆ స్నేహితులు నిర్ణయించుకున్నారు. రూ.35 వేలను వారిలో వారే సేకరించుకున్నారు. ఈ సాయాన్ని ఆపన్నులకు ఇచ్చి ఆదుకోవాలని భావించారు. అమలాపురం కొంకాపల్లిలోని హరిమనోవికాస కేంద్రంలో ఉన్న మానసిక వికలాంగులకు ఆ సొమ్మును సాయం అందించాలనుకున్నారు. గురువారం జరిగిన బాలల దినోత్సవ వేడుకలను వేదికగా చేసుకున్నారు.
మిత్ర టీం పేరుతో వారు సేకరించిన రూ.35 వేలతో మానసిక వికలాంగుల పిల్లలకు నెలకు సరిపడే కిరాణా సరుకులు, టీచింగ్ మెటీరియల్, కుర్చీలు, మందులు సమకూర్చారు. ఫేస్‌బుక్ ద్వారా కలిసిన మిత్ర టీంలో సభ్యుడైన డాక్టర్ రామకృష్ణ ఈ సాయాన్ని ఆర్డీఓ సీహెచ్.ప్రియాంక చేతులమీదుగా అందించారు. డాక్టర్ రామకృష్ణ వికలాంగులకు ప్రత్యేక వైద్యపరీక్షలు చేసి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఫేస్‌బుక్ ద్వారా మిత్రులై ఇలాంటి సేవా కార్యక్రమానికి ముందుకు వచ్చిన మిత్ర టీంను అభినందించారు. వికలాంగుల పిల్లలతోఆర్డీఓ కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో హరిమనోవికాస కేంద్రం డెరైక్టర్ ఎస్.అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement