ఇక ఫేస్‌బుక్‌ను వినొచ్చు!
న్యూయార్క్: ఫేస్‌బుక్ అంటే ఫొటోలు షేర్ చేయడం, లైక్‌లు కొట్టడం, కామెంట్‌లు రాయడం గురించి మాత్రమే తెలుసు. మరి ఫేస్‌బుక్‌ను వినొచ్చనే విషయం మీకు తెలుసా? ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది మాత్రం అందరికోసం కాదు... కేవలం అంధుల కోసమే. ఫేస్‌బుక్ ఓపెన్ చేయగానే అందులోని ఫొటోల గురించి మాటల్లో వివరిస్తుంది. ఐదేళ్ల కిందట ఫేస్‌బుక్ ఏర్పాటు చేసిన యాక్సెసిబిలిటీ బృందం 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. దీని సాయంతో పోస్టింగ్‌లను స్క్రోల్ చేస్తున్నప్పుడు అప్‌లోడ్ అయిన ఫోటోల వివరాలు మాటల రూపంలో వినిపిస్తాయి.
ఇది అంధులకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని ఆ సంస్థ ప్రకటించింది. సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ సదుపాయాన్ని ప్రస్తుతానికి ఐఓస్ వినియోగ దారులు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. త్వరలో ఆండ్రాయిడ్ వినియోగదారులకూ అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది.
We just launched a tool that uses artificial intelligence to help people who are blind experience photos on...
Posted by Mark Zuckerberg on Tuesday, April 5, 2016