నకిలీ ఎరువుల గుట్టు రట్టు
నకిలీ ఎరువుల గుట్టు రట్టు
Published Tue, Dec 17 2013 4:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM
మందస,న్యూస్‌లైన్: అనుమతులు లేవు.. బ్రాం డెడ్ కంపెనీల మందులూ లేవూ..అంతా డూప్లికేటే..పట్టించుకునే నాథుడే కరువవడంతో స్వేచ్ఛగా డూప్లికేట్ జీవ నియంత్రణ ఎరువుల వ్యాపారం సాగిపోతోంది. అందుకోసం ఏకం గా ఓ గోదాంనే ఏర్పాటు చేసుకున్నారు. మరో అడుగు ముందుకేసి..ఎరువులను తయా రు చేస్తున్నారు కూడా.. బోగస్ కంపెనీల పేర్లతో మందుల నిల్వలను చూసి..దాడులు నిర్వహిం చిన అధికారులే అవాక్కయ్యారు. వివరాలివీ.. మందస రాజావారి కోటకు సమీపంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లోని గదిలో నిబంధనలకు విరుద్ధంగా..ఎటువంటి అనుమతులు లేకుం డా.. కల్తీ జీవ నియంత్రణ ఎరువులు తయారు చేస్తున్నారని, ప్రస్తుతం అక్కడ భారీగా అక్రమ నిల్వలు ఉన్నాయని వ్యవసాయ అధికారులకు సమాచారం అందింది.
దీంతో ఏవో పూజారి సత్యనారాయణ గోదాం వద్దకు వెళ్లారు. అక్కడ వ్యవసాయానికి సంబంధించిన జీవ నియంత్రణ ఎరువులు ఉన్నట్లు గుర్తించారు. వాటిని ఇద్దరు మహిళలు ప్యాకింగ్ చేస్తున్నట్లు గమనించారు. వెంటనే పోలీసులకు, పలాస ఏడీఏ టి.వెంకటేశ్వర్లు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించా రు. అధికారులంతా..కలిసి పక్కా ప్రణాళికతో సోమవారం సాయంత్రం గోదాంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ప్యాకింగ్ చేస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఎం.రమేష్ అనే వ్యక్తి పేరుతో గో దాంలో ఓ కవర్ ఉం దని, గోదాం నిర్వాహకుడు ఆయనే అయి ఉండవచ్చని ఏడీఈ అనుమానం వ్యక్తం చేశారు. గోదాంపై సాయి ఆగ్రో అనే పేరుతో బోర్డు ఉందన్నారు. కానీ ఈ పేరుతో ఎటువంటి లెసైన్సులు జారీ చేయలేదని పేర్కొన్నారు.
12 కంపెనీలకు చెందిన లేబుళ్లు..
గోదాంలో 12 రకాల కంపెనీలకు చెందిన లేబుళ్లు ఉన్నాయని, ఆయా పేర్లతో దేశంలో ఎక్కడా కంపెనీలు లేవని అధికారులు పేర్కొన్నారు. పూర్తిగా డూప్లికేట్ ఎరువుల తయారీ గోదాంగా గుర్తించామన్నారు. ఇక్కడ లభ్యమైన ఎరువులు సైతం నకిలీవేనని నిర్ధారించారు. గోదాంలో ఉన్న ఎరువుల విలువ రూ.లక్షల్లో ఉంటుందన్నారు. ఎరువులను ప్యాకింగ్ చేసేందుకు అవసరమైన అన్ని పరికరాలు ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత సామగ్రిని, లేబుళ్లను స్వాధీనం చేసుకుని, గోదాంను సీజ్ చేశామని అధికారులు చెప్పారు. వాటిని సంబంధిత తహశీల్దార్ లేదా కోర్టులు అధీనంలో ఉంచుతామన్నారు. ఈ దాడుల్లో ఏఈవోలు మెట్ట జ్యోత్స్న, పి.ఉదయ్‌కుమార్, ఆర్‌ఐ రామకృష్ణ, వీఆర్‌వో గౌరీ ప్రసాద్, ట్రైనీ ఎస్సై బి.సురేష్‌బాబు, హెచ్‌సీ మెట్ట విజయ్‌కుమార్ ఉన్నారు.
Advertisement
Advertisement