కర్నూలు: కుమారుడితో సహా దంపతులు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని తుగ్గలి మండలం రామలింగయ్యపల్లె గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన గంగరాజు, తిమ్మక్క దంపతులు తమ కుమారుడితో కలిసి గురువారం వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులంటున్నారు.