అనంతపురం : అనంతపురం జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని యల్లనూరు గ్రామంలో రైతు పెద్ద ఓబులేశు మంగళవారం ఆర్థరాత్రి పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించారు. ఆ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
కుటుంబ సభ్యులు పొలం వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరు అవుతున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని .. పెద్ద ఓబులేశు కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.... మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.