
ఏపీలో రైతు సాధికార కార్పొరేషన్ ఏర్పాటు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ కోసం రైతు సాధికార కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
రైతుల రుణమాఫీ కోసం కేటాయించిన 5 వేల కోట్ల రూపాయలను కార్పొరేషన్కు బదలాయింపు చేసింది. ఈ నెల 22 నుంచి రైతు సాధికారిక కార్పొరేషన్ పనిచేయనుంది.