నందికొట్కూరూరల్, న్యూస్‌లైన్:
కేసీ కెనాల్‌కు మార్చి వరకు నీరివ్వాలని కోరుతూ రైతులు గురువారం మల్యాల వద్ద ధర్నా నిర్వహించారు. హంద్రీ-నీవా కాలువ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ధర్నాలో మాట్లాడారు. కేసీ కెనాల్ రైతులకు రెండు పంటలకు సాగునీరు ఇవ్యాలని ముచ్చమర్రి దగ్గర ఎత్తిపోతల పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంజూరు చేశారని గుర్తు చేశారు. అయితే రైతు నాయకుడుగా ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తి ఈ పనులకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. బ్లాస్టింగుకు ఇళ్లు బీటలు బారి దెబ్బతింటున్నాయని చెప్పి నాలుగు సంవత్సరాలుగా పనులు జరగకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ పనుల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి అనంతపూర్‌కు మూడు టీఎంసీల నీరు తీసుకొనిపోయారని తెలిపారు. జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఏ పార్టీలోకి వెళ్లాలనే ఆలోచన తప్ప రైతులగోడు వినడం లేదని ఎద్దేవా చేశారు.
తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రైతు సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నందికొట్కూరు నియోజకవర్గ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి, బండిజయరాజు. జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి ఐజయ్య మాట్లడుతూ.. నీరు వదలి కేసీరైతులకు న్యాయం చేయలని కోరారు. హంద్రీనీవాకు రెండు పంపుల ద్యారా నీటిని పంపింగ్ చేయడంతో రైతులు అగ్రహం వ్వక్తం చేశారు. నీటిని బంద్‌చేయాలని డిమాండు చేయడంతో అధికారులు ఆమేరకు చర్యలు తీసుకున్నా రు. కాగా, వందలాది రైతులు మల్యా ల దగ్గర ధర్నా చేయడానికి రావడంతో సీఐ శివనారాయణ ఆధ్యర్వంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నాలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు మహేశ్వరరెడ్డి, కాతా రమేష్‌రెడ్డి, ఓబుల్‌రెడ్డి, అబ్దుల్‌మునాఫ్, సత్యంరెడ్డి, కోకిల రమణరెడ్డి, రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.
కదంతొక్కిన రైతులు
Published Fri, Jan 3 2014 2:25 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement