రుణమాఫీపై బ్యాంకులను ముట్టడించిన రైతులు | farmers storm banks in nellore over loan waiver | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై బ్యాంకులను ముట్టడించిన రైతులు

Published Thu, Oct 16 2014 3:49 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

farmers storm banks in nellore over loan waiver

రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో ప్రభుత్వరంగ బ్యాంకులను రైతులు ముట్టడించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమం జరిగింది. రుణమాఫీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవని, అందుకే తాము రైతులకు నోటీసులు ఇస్తున్నామని బ్యాంకు అధికారులు వారికి స్పష్టం చేశారు.

రుణమాఫీపై చంద్రబాబు ప్రజలను, రైతులను మభ్యపెడుతున్నారని కాకాణి గోవర్ధనరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సర్కారు కేవలం మాటలతోనే కాలయాపన చేస్తోంది తప్ప రుణమాఫీ విషయాన్ని చేతల్లో చూపించడంలేదని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement