గోపవరం (ముసునూరు), న్యూస్‌లైన్ : అప్రకటిత విద్యుత్ కోతల వల్ల పంటలన్నీ ఎండిపోతున్నాయంటూ రెతులు కన్నెర్ర చేశారు. గోపవరం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరపరా నిలిపివేసి సబ్‌స్టేషన్ ముందు శనివారం తెల్లవారుజామునుంచి ధర్నా నిర్వహించారు. రైతులకిచ్చే త్రీపేజ్ విద్యుత్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పగలు మూడు, నాలుగు విడతలుగా గంట నుంచి3 గంటల పాటు విద్యుత్‌నిస్తున్నారని రాత్రి ఇచ్చే రెండు గంటలు సైతం రెండు మూడు విడతలుగా ఇస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. త్రీపేజ్ విద్యుత్‌ని ఏడు గంటలు పగలే నిరాటంకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సబ్‌స్టేషన్ ముందు ఆందోళన చేస్తునట్లు సమాచారం అందుకున్న ముసునూరు ఏఈ పిచ్చేశ్వరరావు గోపవరం సబ్‌స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్న రైతులతో చర్చిండానికి ప్రయత్నించగా రైతులు ఆయన తో తీవ్ర వాదోపవాదాలకు దిగారు. నూజివీడు ట్రాన్స్‌కో డీఈ వచ్చి సమస్య పరిష్కరిస్తానని లిఖిత పూర్వకహామీ ఇచ్చేవరకు ధర్నా విరమించేది లేదని భీష్మించారు. ఉద్రిక్త పరిస్తితులకు దారి తీస్తుందనే భావనతో నూజివీడు డీఎస్పీ ఏ శంకరరెడ్డి, నూజివీడు సీఐ. సీహెచ్‌వీ మురళీకృష్ణ , నూజివీడు రురల్, ఎస్‌ఐ ఆదిప్రసాద్, ముసునూరు ఎస్‌ఐ గుడివాడ అనీల్‌కుమార్, పోలీసు బృందం గోపవరం చేరుకున్నారు. మధ్యాహ్నం గోపవరానికి చేరుకున్న నూజివీడు ట్రాన్స్‌కో డీఈ వెంకటేశ్వర్లు ధర్నా చేస్తున్న రైతులు డీఎస్పీ.సీఐ, కృష్ణారావు సమక్షంలో చర్చలు జరిపారు. పగటి వేళల్లో ఏడు గంటలు నిరాటకంగా త్రీపేజ్ విద్యుత్ ఇవ్వాల్సిందేనని రైతులు పట్టుబట్టారు. ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో పోన్‌లో మాట్లాడిన డీఈ వెంకటేశ్వర్లు రైతుల డిమాండ్ నెరవేర్చడానికి సానుకూలంగా స్పందించడంతో రైతులు సాయంత్రం ధర్నా విరమించారు.
ఈ ధర్నాలో గోపవరం, వేల్పుచర్ల, వెంకటాపురం, కాట్రేనిపాడుకి, చెందిన రెండు వందలకి పైగా రైతులు హజరయ్యారు. కాంగ్రెస్ నాయకుడు ముత్తంశెట్టి కృష్ణారావు, నందిగం సత్యనారాయణ. నందిగం గంగాధరరావు, బొల్లినేని బుజ్జి, వల్లభనేని గోపాలకృష్ణ, మూతినేని రాదాకృష్ణ. తుమ్మల నాగేశ్వరరావు, నందిగం నవీన్, వాసు, ప్రవీణ్, మాకినేని నాగర్జున పాల్గొన్నారు.
విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు రైతుల ధర్నా
Published Sun, Dec 22 2013 4:18 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement