గుర్రంపోడు, న్యూస్‌లైన్: ఏఎమ్మార్పీ ఆయకట్టుకు నీరందించే విషయమై అధికారులు ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయకపోవడం అన్నదాతలను అయోమయానికి గురిచేస్తోంది. రెండేళ్లుగా రబీలో ఆయకట్టుకు నీటి విడుదల జరగలేదు. గతంలో పలుమార్లు రబీలో ఆరుతడి పంటలకు, మంచినీటి అవసరాలకు అంటూ ఇష్టానుసారంగా నీటి విడుదలతో రైతులు రబీలో వరిసాగు చేపట్టి ఇబ్బందులు పడేవారు. ఈసారి ప్రాజెక్టులో పుష్కలంగా నీరుండడం, ఎన్నికల ఏడాది కావడంతో రబీలోనూ నీటిని విడుదల చేస్తారని రైతులు భావిస్తున్నారు.
ప్రాజెక్టు పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టు 1,80,000. ఖరీఫ్‌లో 1,50,000 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఈ రబీలోనూ దాదాపు లక్ష ఎకరాల్లో వరి సాగుచేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు అనుగుణంగా రబీ వరినార్లు పోసుకుని నీటి విడుదలకు ఎదురుచూస్తున్నారు. రబీలో కేవలం 20రోజుల వ్యవవధిలోనే నారు నాటుకోవాల్సి ఉంటుంది. పోసుకున్న నార్లు ముదురి పోయేలా ఉన్నాయని రైతులు వాపోతున్నారు. సాగర్ ఎడుమ కాల్వలకు నీటి విడుదల చేస్తున్న అధికారులు ఏఎమ్మార్పీ విషయంలో పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏఎమ్మార్పీ నుంచి రబీకి నీరిచ్చేనా?
Published Sat, Dec 21 2013 2:54 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement