రైతు సంక్షేమం జగన్‌తోనే సాధ్యం | Farmers Welfare to jagantone | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమం జగన్‌తోనే సాధ్యం

Published Mon, Oct 28 2013 1:02 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Farmers Welfare to jagantone

పెనుగంచిప్రోలు/జగ్గయ్యపేట/వత్సవాయి, న్యూస్‌లైన్ : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు సంక్షేమ ప్రభుత్వం వస్తుందని వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. పేట నియోజకవర్గంలో ఆదివారం ఆమె వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం పెనుగంచిప్రోలు మండలంలోని ముండ్లపాడు క్రాస్‌రోడ్స్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. వర్షాలకు పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న, కాయగూరలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఇంకా నీలం తుపాను నష్టపరిహారమే అందించని కాంగ్రెస్ సర్కారు ఈ పరిహారం ఎలా అందిస్తుందని ఎద్దేవా చేశారు.  

 అడుగడుగునా ఘనస్వాగతం...

 విజయమ్మకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. రోడ్లపైకి వచ్చి కారు ఆపి మరీ ఆమెతో మాట్లాడేందుకు ఆసక్తి చూపారు. తమ గోడు వినిపించేందుకు కొందరు పాడైపోయిన పంటలను తీసుకొచ్చారు. చిల్లకల్లులో నిర్వహించిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలోనూ పలువురు దెబ్బతిన్న పంటలను ఆమెకు చూపించి గోడు వెళ్లబోసుకున్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ,  మహిళావిభాగం రాష్ట్ర కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి,  మాజీ ఎమ్మెల్యేలు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), పేర్ని నాని, జోగి రమేష్, వంగవీటి రాధా, జ్యేష్ఠ రమేష్‌బాబు,  విజయవాడ సెంట్రల్ సమన్వయకర్త గౌతమ్‌రెడ్డి, పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన, ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు తన్నీరు నాగేశ్వరరావు, వడ్లమూడి నాని, వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ చల్లా బ్రహ్మేశ్వరరావు, జిల్లా స్టీరింగ్ కమిటీసభ్యులు చౌడవరపు జగదీష్, చింకా వీరాంజనేయులు, జన్ను మహంతి ఉదయ్‌భాస్కర్, వేల్పుల రవికుమార్, వూట్ల నాగేశ్వరరావు, లగడపాటి మోహనరావు, గాదెల బాబు, భూక్యా రాజానాయక్, రాష్ట్ర యువజన సంఘం సభ్యులు మండవ శ్రీనివాస్‌గౌడ్, నూజివీడు నియోజకవర్గ నాయకులు లాకా వెంగళరావ్ యాదవ్, కోటగిరి గోపాల్, పెడన నాయకులు ఉప్పాల రాము, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండల కన్వీనర్లు మాతంగి వెంకటేశ్వర్లు, వడ్డే పరమయ్య, గూడపాటి శ్రీనివాసరావు, జగ్గయ్యపేట మున్సిపల్ మాజీ చెర్మన్ ముత్యాల వెంకటాచలం, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తుమ్మేపల్లి నరేంద్ర, పట్టణ పార్టీ కన్వీనర్  షేక్ మదార్‌సాహెబ్, చిట్యాల వైఎస్సార్‌సీపీ నాయకులు మారెళ్ల బ్రదర్స్,   చిల్లకల్లు, గౌరవరం, తక్కెళ్లపాడు, అనిగండ్లపాడు, ముండ్లపాడు గ్రామ సర్పంచ్‌లు సంపత విజిత, గోవా రామకృష్ణ, గెటావతు లలిత, కనకపూడి ప్రియాంక, మందా సుజాత, కుక్కల మరియమ్మ, మహిళా నాయకురాలు బూతుకూరి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement