సాక్షి, తాడేపల్లి: ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు. పురంధేశ్వరి బీజేపీలో ఉందా? లేక టీడీపీలో ఉందా? అని ప్రశ్నించారు. పురంధేశ్వరి లేఖలకు భయపడేవారు, బెదిరిపోయే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, మాజీ మంత్రి కొడాలి నాని శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు పురంధేశ్వరి ఒక లేఖ రాశారని టీడీపీ అనుకూల మీడియాలో హడావుడి చేస్తున్నారు. చంద్రబాబు వదినను ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకులే కొన్ని ప్రశ్నలు అడిగితే బాగుంటుంది. పురంధేశ్వరి బీజేపీలో ఉన్నట్టు కనిపించడం లేదు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతిస్తోందని బాబు చెప్పడంతో టీడీపీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ బయటకు వచ్చారు.
కాంగ్రెస్‌తో ఉన్నది చంద్రబాబే..
చంద్రబాబు ప్రయోజనాల కోసమే పురంధేశ్వరి బీజేపీలో చేరారు. ఆమెకు రాజకీయ విలువలు ఉన్నాయా? లేవా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వెనుక, కాంగ్రెస్‌తోనూ ఉన్నది చంద్రబాబేనని అంత స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌తో పోరాడుతున్నాం, బీఆర్ఎస్‌తో పోరాడుతున్నాం అంటున్న బీజేపీకి కాకుండా.. టీడీపీకి పురంధేశ్వరి మద్దతు ఇస్తోంది. టీడీపీ అంటే కాంగ్రెసే కదా?. మరి, పురంధేశ్వరి కాంగ్రెస్‌లో ఉన్నట్టా? లేక టీడీపీలో ఉన్నట్టా? లేక బీజేపీలో ఉన్నట్టా? అన్నది బీజేపీ వారే అర్థం చేసుకోవాలి. ఆమె గతాన్ని చూస్తే టీడీపీలో ఉండి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది.
వీరి రాజకీయం ఎవరి కోసం..
కాంగ్రెస్‌లో ఉండి కేంద్రమంత్రి పదవి అనుభవించి, అధికారం పోయిందని వారినీ వదిలేసి బయటకు వచ్చింది. ఆ తర్వాత బీజేపీలో చేరినా, బాబు ఆదేశాల మేరకు, బాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న రేణుకా చౌదరి, బీజేపీలో ఉన్న పురంధేశ్వరి.. చంద్రబాబు ప్రయోజనాలు, ఎల్లో బ్యాచ్ ప్రయోజనాలు కాపాడటంలో ముందుకు సాగుతున్నారు. వీరి రాజకీయం ఎవరి కోసం?’ అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబుకు కొత్త టెన్షన్.. సన్నిహితులపై ఆక్రోశం!
Comments
Please login to add a commentAdd a comment