ఆపేయాలంతే..! | Fencing work cilakalagutta objections | Sakshi
Sakshi News home page

ఆపేయాలంతే..!

Published Sun, Jan 12 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM

Fencing work cilakalagutta objections

  • చిలకలగుట్ట ఫెన్సింగ్ పనులకు అభ్యంతరాలు
  •  అభయారణ్యం అంటున్న అటవీశాఖ
  •  మేడారం పనుల్లో సమన్వయలోపం
  •  సందిగ్ధంలో పనులు
  •  ఊరట్టం-మల్యాల రోడ్డుదీ ఇదే దుస్థితి
  •  
    సాక్షి, హన్మకొండ : గిరిజనుల ఆకాంక్ష నెరవేరుతున్న వేళ.. అటవీశాఖ అడ్డుపుల్ల వేసింది. ఫలితంగా చిలకలగుట్ట చుట్టూ చేపడుతున్న ఫెన్సింగ్ పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రిజర్వు ఫారెస్టులో నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదంటూ అ టవీశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడం.. ప్రభుత్వశాఖల మధ్య ఉన్న సమన్వయ లో పాన్ని మరోసారి బట్టబయలు చేసింది. సమ్మక్క తల్లి కొలువుండే చిలకలగుట్ట పవిత్రతను కాపాడేందుకు దానిచుట్టూ రక్షణగోడ నిర్మిస్తామని గత జాతర  సందర్భంగా మేడారం వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. రెండేళ్లుగా దాని గురించి ఎవరూ ప ట్టించుకోలేదు.

    చివరికి ప్రస్తుత జాతర ప్రణాళిక రూపొందించే సమయంలోనూ జిల్లాయంత్రాంగం ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీనిపై గిరిజన పూజారులు నిరసన వ్య క్తం చేయడంతో గతనెల 10న మేడారంలో జరి గిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఈ అంశంపై ప్రకటన చేశారు. ఫెన్సింగ్ కోసం నిధులు మంజూరయ్యాయని, సమయం తక్కువగా ఉండడంతో జాతర ముగిసిన తర్వాత ఐటీడీఏ ఆధ్వర్యంలో పనులు చేపడతామని వివరించా రు.

    కానీ అనూహ్యంగా గత నెల 23న చిలకల గుట్ట చుట్టూ ఫెన్సింగ్ పనులకు టెండర్లు ఆ హ్వానించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఈనెల తొమ్మిదో తేదీన పనులు ప్రారంభిం చారు. ఎస్టిమేషన్ ప్రకారం చిలకలగుట్ట చుట్టూ ఆరు అడుగుల ఎత్తు గోడ, దానిమీద మరో నా లుగు అడుగుల ఎత్తుతో ఫెన్సింగ్ ఏర్పాటు చే యాలి. మొత్తం పది అడుగుల ఎత్తున గుట్ట చు ట్టూ  600 మీటర్ల పొడవుతో రక్షణ గోడ, ఫెన్సింగ్ నిర్మించాల్సి ఉంది. తొలిరోజు  40 గుంతలు తవ్వి పనులకు శ్రీకారం చుట్టారు. మూడో రోజైన శనివారం ఉదయం ఎనిమిది గంటలకే పనులు జరుగుతున్న ప్రాంతానికి చే రుకున్న అటవీశాఖ అధికారులు రిజర్వు ఫారెస్టులో నిర్మాణాలు చేపట్టరాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
     
    గోడ లేకపోతే ఓకే..
     
    అటవీశాఖ అధికారుల అభ్యంతరాలపై స్థానిక నాయకులు, పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని వెంటనే ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓ సంజీవయ్య, జాతర ఈఓ దూసరాజేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. తీవ్ర ఉత్కంఠ మధ్య సాయంత్రం ఆరు గంటలకు డీఎఫ్‌ఓ లింగరాజు మేడారం చేరుకుని చిలకలగుట్ట చుట్టూ జరుగుతున్న ఫెన్సింగ్ పనులు పరిశీలించారు. ఆరడుగుల ఎత్తుతో గోడ ప్రతిపాదనను తిరస్కరించారు. పూర్తిగా ఫెన్సింగ్ నిర్మిస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. అయితే గోడలేకుండా ఉత్త ఫెన్సింగ్ నిర్మించడం వల్ల ఉపయోగం లేదని పూజారుల సంఘం నాయకులు, గిరిజన నేతలు అంటున్నారు. దీంతో గుట్టచుట్టూ రక్షణ నిర్మాణం ఎలా చేపట్టాలనే విషయంపై సందిగ్ధత నెలకొంది.
     
    సమన్వయ లోపం
     
    అభయారణ్యం గుండా పని చేపట్టేప్పుడు అటవీశాఖ అధికారుల అనుమతి తీసుకోవాల నే విషయంలో ప్రభుత్వ శాఖలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. మల్యాల-ఊరట్టం రోడ్డు పనుల వి షయంలో ఆర్‌అండ్‌బీ ఇదే ధోరణి అవలంబిం చడంతో పనులు నిలిచిపోయాయి. పూర్తిగా అటవీప్రాంతంలో జరిగే జాతర పనుల మాస్టర్ ప్లాన్‌ను చేతిలో ఉంచుకున్న అటవీ అధికారులు సైతం తగిన విధంగా స్పందించ డం లేదన్న విమర్శలున్నాయి. పనుల ప్రతిపాదనలప్పుడు మిన్నకుంటున్న అధికారులు తీరా పనులు ప్రారంభమైన తర్వాత అభ్యంతరం చెప్పడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
     
     మూడు అడుగుల గోడైనా..
     చిలకలగుట్ట చుట్టూ కనీసం మూడు అడుగుల ఎత్తులోనైనా గోడ కట్టనివ్వాలి. దానిపై మరో ఏడు అడుగుల ఎత్తులో ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునే అనుమతి ఇస్తే బాగుంటుంది. ఈ విషయంలో అధికారులు ఓ నిర్ణయానికి రావాలి.
     -  గడ్డం సంధ్యారాణి, సర్పంచ్, ఊరట్టం
     
     అడ్డుకోవడం సరికాదు
     పోడు వ్యవసాయం చేసుకోవడానికో, చెట్లు నరికేందుకో మేం అనుమతి అడగడం లేదు. గుట్ట చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేయమంటున్నాం. అక్కడి పవిత్రత, ప్రకృతిని కాపాడాలని కోరుతున్నాం. దీనికి కూడా అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేయడం విచారకరం. వారి నిర్లక్ష్యం కారణంగా వెలకట్టలేని కలప స్మగ్లర్ల చేతికి చిక్కుతున్నా పట్టించుకోరు కానీ రక్షణ పనులు చేపడితే మాత్రం తప్పుపడుతున్నారు.
     - అల్లం రామ్మూర్తి, మాజీ చైర్మన్, మేడారం జాతర ట్రస్టుబోర్డు
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement