అనంతపురం నగరంలోని రాణి నగర్లో ఓ ఇంట్లో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న పెట్రోల్ టీన్కు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.