వైఎస్సార్ జిల్లా అర్బన్: షార్టు సర్యూట్‌తో టింబర్ డిపోలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా దేవుని కడప రోడ్డులో శనివారం రాత్రి జరిగింది. వివరాలు.. దేవుని కడప రోడ్డులోని తిరుపతి టింబర్ డిపోలో షార్టు సర్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటానా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, ఈ ప్రమాదంలో సుమారుగా రూ.10-15 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని డిపో యజమాని వెంకట సుబ్బయ్య తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.