శ్రీరాంపురం: తూర్పుగోదావరి జిల్లాలోని సెజ్ ప్రతిపాదిత భూముల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారుగా 12 ఎకరాల విస్తీర్ణంలోని పంటలు బుగ్గిపాలయ్యాయి. ఈ సంఘటన కొంతపల్లి మండలంలోని శ్రీరాంపురం గ్రామంలో మంగళవారం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలిసిరాలేదు. ఈ ప్రమాదంలో 12 ఎకరాల విస్తీర్ణంలో జీడిమామిడి, మామిడి, చెరకు పంటలు అగ్నికి ఆహుతయ్యాయి.
అయితే, ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం సెజ్ పరిధిలోకి రావడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.