
విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
విజయనగరం జిల్లాలో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
విజయనగరం : విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లాలోని మెరకముడిదాం మండలం, గర్భాం గ్రామంలో ఉన్న ఆంధ్ర పెర్రో ఎలైలస్ కంపెనీలో మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలోని ట్రాన్స్‌పార్మర్‌లో మంటలు చెలరేగాయి. దాంతో మంటలు ఎగిసిపడి కంపెనీకి అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమైంది.
అప్రమత్తమైన కంపెనీ యాజమాన్యం సిబ్బందిని బయటకు పంపించడంతో ప్రాణనష్టం జరగలేదు. కాగా, ఈ ప్రమాదంలో సుమారు రూ.30-50 కోట్ల ఆస్తినష్టం వాటిల్లిందని యాజమాన్యం తెలిపింది. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు.