సాక్షి, విశాఖపట్నం : సాగర్‌నగర్ సన్‌రేస్ దాబాలో అగ్ని ప్రమాదం సంభవించింది. చెత్తకుప్పలను తగలబెడుతుండగా గాలికి నిప్పులురవ్వలు దాబాలో గడ్డితో వేసిన గుడిసెలపై పడటంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు మూడు లక్షల ఆస్తినష్టం జరిగినట్లు దాబా నిర్వాహకులు ఆరోపించారు. అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా మంటలు అదుపులోకి రాకపోవడంతో మరికొన్ని అగ్నిమాపక యంత్రాలు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment