సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ‘మేడారంతో నాకు గొప్ప అనుబంధముంది. నా ఫస్ట్ పోస్టింగ్ అక్కడే. 2012 జాతర సమయంలో ములుగులో సబ్ కలెక్టర్‌గా ఉన్నాను. అందుకే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. వరుసగా రెండోసారి జాతరలో పాలుపంచుకోవటం ఆనందంగా ఉంది.
ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా డిసెంబర్ వరకు వరంగల్‌లోనే ఉన్నాను. మేడారం యాక్షన్ ప్లాన్ అప్పుడే సిద్ధమైంది. ఈసారి జాతర ఏర్పాట్లు, అవసరమైన ప్రతిపాదనలన్నీ నేను సిద్ధం చేశాను. గతంతో పోలిస్తే భక్తులు ఇబ్బంది పడకుండా మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు నావంతు ప్రయత్నం చేశాను. వరుసగా రెండుసార్లు జాతర నిర్వహణలో పాలుపంచుకోవటం ఆనందంగా ఉంది.
బుధవారం ఉదయమే అక్కడికి వెళ్లాను. ఈ రోజు సాయంత్రమే తిరిగి వచ్చాను...’ అంటూ జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మేడారం గిరిజన మేళా విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే...
‘ఇంత పెద్ద జాతర నేనెప్పుడూ చూడలేదు. దేశంలో కుంభమేళా తర్వాత ఇదే పెద్ద జాతర. అలహాబాద్ సిటీ కావటంతో కుంభమేళాకు వచ్చే భక్తులకు వసతి సదుపాయాలు కల్పించటం ఇబ్బందేమీ కాదు. కానీ.. అటవీ ప్రాంతంలో మారుమూలన ఉన్న మేడారంకు తరలివచ్చే భక్తులకు కనీస సదుపాయాలు కల్పించటం అధికారులందరికీ పెద్ద టాస్క్. వన దేవతలకు మొక్కులు చెల్లించేందుకు ఎడ్ల బండ్లు, బస్సులు, ఇతరత్రా వాహనాల్లో వివిధ ప్రాంతాల నుంచే వచ్చే భక్తులు తరలిరావటం గొప్ప అనుభూతి. వారందరికి ఇంట్లో ఉన్నట్లుగా సదుపాయాలు కల్పించకలేకపోయాని... కనీసం సాఫీగా దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తే ఎంతో మేలు చేసినట్లే. అదే కర్తవ్యంతో పని చేశాను. గత జాతరతో పోలిస్తే ఈసారి భక్తుల రద్దీలో పెద్ద తేడా కనిపించలేదు.
గత జాతర అనుభవాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయటంతో ఈసారి బడ్జెట్టు కూడా ఎక్కువగానే వచ్చింది.
గత జాతరకు రూ.40 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ.100 కోట్లు విడుదల చేసింది. రెండు రోజుల పాటు అక్కడే ఉండి.. జాతర ఏర్పాట్లు దగ్గరుండీ పర్యవేక్షించే అవకాశం రావటం ఆనందంగా భావించాను..’
తొలి మజిలీ మేడారం
Published Sat, Feb 15 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM
Advertisement
Advertisement