
పన్నుల వసూళ్లలో బాపట్ల ఫస్ట్
► చిట్టచివరి స్థానంలో నరసరావుపేట
► లక్ష్యానికి దగ్గర్లో చిలకలూరిపేట, తాడేపల్లి
పిడుగురాళ్ల : జిల్లాలో ఉన్న 12 మున్సిపాలిటీల్లో పన్ను వసూళ్లలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను బాపట్ల నిర్ధేశించిన లక్ష్యాన్ని సాధించింది. నరసరావుపేట చిట్టచివరి స్థానంలో నిలిచింది. లక్ష్యాలను ప్రతి మున్సిపాలిటీ అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అప్పుడు అభివృద్ధి సాధ్యపడుతుందని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఎప్పుడూ వూర్చి 31వ తేదీ వుుగిసే పన్ను వసూళ్ల కార్యక్రమం ఈ సారి ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు పెంచి నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది ఉదయుం, రాత్రి తేడా లేకుండా వసూళ్ల కార్యక్రమంచేపట్టారు. పిడుగురాళ్ల వుున్సిపాలిటీ అధికారులయితే ఏకంగా ఆటోలో ప్రచారం చేస్తూ వసూళ్లు చేపట్టారు. జిల్లాలోని అన్ని మున్సిపల్ కార్యాలయూల పరిధిలోని అధికారులు వారివారి పంథాలో పన్నుల వసూళ్ల కార్యక్రమం చేపట్టారు.
గృహాలు ఎక్కువగా ఉన్న తెనాలి, నరసరావుపేట, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు మందగించారుు. నరసరావుపేటలోమరీ తక్కువగా 52.86 శాతం వూత్రమే వసూలు కావడంతో జిల్లాలో వెనుకబడి ఉంది. జిల్లాలో వరుసగా 8వ స్థానంలో పిడుగురాళ్ళ పట్టణం ఉంది. లక్ష్యాన్ని సాధించడంలో జిల్లా వ్యాప్తంగా చూస్తే కేవలం బాపట్ల, పొన్నూరు మున్సిపాలిటీలు విజయుం సాధిస్తే లక్ష్యానికి దగ్గరలో చిలకలూరిపేట, తాడేపల్లి ఉన్నాయి.