గంజాయి తరలిస్తున్న ఐదుగురు అరెస్టు | five arrested in ganjai case | Sakshi
Sakshi News home page

గంజాయి తరలిస్తున్న ఐదుగురు అరెస్టు

Published Wed, Apr 15 2015 5:39 PM | Last Updated on Sun, Sep 3 2017 12:20 AM

five arrested in ganjai case

విశాఖపట్టణం: విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో మరోసారి పెద్ద ఎత్తున గంజాయి దుండగులను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులు చింతపల్లి, సీలేరు తదితర ప్రాంతాల నుంచి 65 కిలోల గంజాయిని వాహనాల్లో తరలిస్తుండగా రోలుగుంట మండలం పెద్దపేట కూడలి వద్ద బుధవారం తెల్లవారుజామున పోలీసుల తనిఖీల్లో వెలుగు చూసింది.


ఈ సందర్భంగా బీహార్‌కు చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 65 కిలోల గంజాయి, వ్యాను, కారు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రూ.2.35లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను పోలీసులు బుధవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు.
(రోలుగుంట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement