వేర్వేరు రోడ్డు ప్రమాదాలు: అయిదుగురు మృతి
ఖమ్మం జిల్లా తల్లాడ సమీపంలో రహదారిపై బుధవారం తెల్లవారుజామున లారీ - బైక్ ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరుపల్లి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీటితోపాటు మెదక్ జిల్లా రామాయంపేట మండలం దొంగలధర్మారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి మహేష్ హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.