
సాక్షి, కర్నూలు: విధి ఒక్కొక్కసారి వింత నాటకం ఆడుతుంది. అమితమైన సంతోషాలను, అంతులేని విషాదాలను మోసుకొస్తుంటుంది. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలో ఆదివారం అంతులేని విషాదమే నెలకొంది. ఈ ఊళ్లో ఒకే రోజు అయిదుగురు మృతి చెందడమే ఇందుకు కారణం. అందరూ అనారోగ్యంతోనే చనిపోయారు. వీరిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. గ్రామంలోని ప్రధాన రహదారికి సమీపంలో ఉండే మాబు(28), ఆంజనేయస్వామి ఆలయ సమీప వీధికి చెందిన రామాంజనమ్మ(29), ఇతర కాలనీలకు చెందిన బొందలదిన్నె దస్తగిరి(70), కాకర్ల మహబూబ్‌బాష(26), అలాగే ఓ వృద్ధురాలు అనారోగ్యంతో చనిపోయారు. ఇందులో ముగ్గురు చిన్న వయస్సులోనే మృతి చెందడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
Comments
Please login to add a commentAdd a comment