కారు కోసం మోసగాడయ్యాడు
- ఏడు కేసుల్లో ఏటీఎం నిందితుడి అరెస్ట్
- రూ.1,43,303 నగదు, 5 ఏటీఎం కార్డుల స్వాధీనం
- నిందితుడు అనంతపురం జిల్లా కొక్కంటి వాసి
బి.కొత్తకోట: సొంతంగా కారు కొనాలన్న కోరిక ఓ వ్యక్తిని మోసగాడయ్యేలా చేసింది. ఏటీఎం కేంద్రాలకు వచ్చే ఖా తాదారులను ఏమార్చి ఖాతాల్లోని నగదును దోచుకుంటున్న ఆ వ్యక్తిని సోమవారం బి.కొత్తకోట ఎస్‌ఐ బీవీ.శివప్రసాద్‌రెడ్డి, సిబ్బంది దాడి చేసి అరెస్టు చేశా రు. ఎస్‌ఐ కథనం మేరకు.. అనంతపు రం జిల్లా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌కు చెందిన షేక్ షఫీ(37) స్వతహాగా డ్రైవర్. 8వ తరగతి చదువుకున్న ఇతను మదనపల్లెకు చేరుకొని 2007 నుంచి 2009 వరకు ఇక్కడే డ్రైవర్‌గా పనిచేశాడు.
తర్వాత ముంబై చేరుకొని 2013 డిసెంబర్ వరకు అక్కడే ఉన్నాడు. ఏటీఎం మోసాల గురించి తెలుసుకున్నాడు. తిరిగి స్వగ్రామం చేరుకున్నాడు. బి.కొత్తకోటలో ఏటీఎం కేంద్రాలున్నాయన్న విషయం తెలుసుకొన్న షఫీ ఇక్కడికి మకాం మార్చాడు. స్థానిక పీటీఎంరోడ్డు, దిగువబస్టాండ్లలోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాల వద్ద మకాం వేసేవాడు. అమాయకులు ఏటీఎంలో డబ్బు లు తీసేందుకు వచ్చారని పసిగట్టి లోనికి వచ్చేవాడు. నగదు తీసేందుకు చేతకాని వారికి సహాయం చేసే నెపంతో వారి పిన్ నంబర్ తెలుసుకొని డబ్బు తీసిచ్చేవా డు.
ఈ సమయంలో ఖాతాదారుడికి అసలు ఏటీఎం కార్డు ఇవ్వకుండా మరొకరిది ఇచ్చేవాడు. వారు వెళ్లిన తర్వాత వారి ఖాతాలో ఉన్న నగదునంతా డ్రా చేసుకునేవాడు. అలాగే నగదు తీసుకెళ్లే వారిని ఢీకొని వారి కార్డులు కిందపడితే తీసిచ్చినట్టు నటించి కార్టులు మా ర్చేసేవాడు. ఇలా బి.కొత్తకోటలో ఆరుగురిని, కురబలకోట మండలం అంగళ్లు లో ఒకరిని మోసం చేశాడు. దీనిపై బాధితులు ఫిర్యాదులు చేయడంతో ఏడు కేసులు నమోదు చేశారు. వీటీలో ఆరు కేసులు బి.కొత్తకోటలో నమోదయ్యా యి. దీనిపై దర్యాప్తు చేపట్టిన బి.కొత్తకోట పోలీసులు నిందితుడి కూపీ లాగా రు.
దోచుకున్న సొమ్ముతో బెంగళూరు లో కారు కొనేందుకు వెళ్తున్న విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుళ్లు కుమార్, శ్రీహారి, మహదేవనాయక్, కానిస్టేబుళ్లు ఎస్.దస్తగిరి, ఇబ్రహీం, వరేంద్ర, మురళీ దాడి చేశారు. స్థానిక బెంగళూరు రోడ్డులోని పెట్రోలు బంకు వద్ద ఉండగా సోమవారం ఉదయం 9 గంటలకు నిందితుడు షఫీని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.1,43,303 నగదును, 5 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న నగదులో బి.కొత్తకోటకు చెందిన సుబ్రమణ్యానికి చెందిన రూ.9,700, కృష్ణారెడ్డికి చెందిన రూ.9 వేలు, చంద్రశేఖర్‌కు చెందిన రూ.16 వేలు, రామకృష్ణారెడ్డికి చెందిన రూ.50 వేలు, సూర్యనారాయణచారికి చెందిన రూ.35,500, సురేంద్రబాబుకు చెందిన రూ.3,700, కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన శంకర్రాజుకు సంబంధించిన రూ.28,500 ఉన్నట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.