45 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థత
తిరుపతి నారాయణ విద్యాసంస్థలో ఫుడ్ పాయిజన్
తిరుపతి రూరల్: తిరుపతి శివారు కాలూరు క్రాస్‌లో నారాయణ విద్యాసంస్థలకు చెందిన స్కూల్ హాస్టల్‌లో గురువారం రాత్రి భోజనం చేసిన 45మం దికిపైగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. రోజుల తరబడి నిల్వ ఉంచిన పులిసిన మజ్జిగతో చేసిన పులుసు తిన్నవారందరికీ అర్థరాత్రి రెండు గంటలనుంచి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు మొదల య్యాయి. 600మం దికిపైగా ఉన్న ఆ హాస్ట ల్‌లో ప్రాథమిక చికిత్స అందించేందుకు వైద్యుడు కూడా లేరు.
దీంతో అర్థరాత్రి వారిని హుటాహుటిన తిరుపతి, చెర్లొపల్లి, పుదిపట్లలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి సెలైన్ ఎక్కించారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. చికిత్స పొందుతున్న ఓ విద్యార్థి ఆసుపత్రి సిబ్బందికి చెందిన ఫోన్‌నుంచి తన తండ్రికి తెలపడంతో సమాచారం బయటికొచ్చింది.దీంతో తల్లి దండ్రులు, విద్యార్థి, ప్రజాసంఘాల నేతలు మండిపడ్డారు. చర్యలు తీసుకోవా లంటూ స్కూల్ ముందు శుక్రవారం ధర్నా చేశారు. దీనిపై ఎంఆర్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.