* శాటిలైట్ ద్వారా గుర్తించిన
* అటవీ ప్రాంతాల్లో వివరాల సేకరణ
* పశ్చిమ డివిజన్‌లో 224 పాయింట్లలో సిబ్బంది సర్వే
బి.కొత్తకోట: పదేళ్ల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కోసం చిత్తూరు పశ్చిమ అటవీ డివిజన్ పరిధిలో సోమవారం నుంచి సర్వే ప్రారంభమైంది. సాధారణంగా ప్రతి పదేళ్లకోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అడవుల స్థితిగతులపై సర్వే నిర్వహించి నివేదికలు పంపుతారు. ఇందులో ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలతో అడవులు అభివృద్ధి చెందాయా లేదా అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.
శాటిలైట్ చెప్పిన చోటనే సర్వే
అటవీ సిబ్బంది నిర్వహిస్తున్న సర్వేను అధికారులు మార్గనిర్దేశం చేయడంలేదు. హైదరాబాద్ నుంచి శాటిలైట్ పంపిన చిత్రాల ఆధారంగా సర్వే ప్రాంతం నిర్ణయించారు. సర్వే కోసం గుర్తించిన పాయింట్ల వద్దకు చేరుకొన్న అటవీ సిబ్బంది వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. 30 చదరపు మీటర్ల వైశాల్యంలో అటవీప్రాంతం ఎంత, ఏ రకాల వృక్షాలు ఉన్నాయి, ఔషధ మొక్క లు ఉన్నాయా, బండ, రాయి ఉందా, నీటి ప్రవాహాలు ఉన్నాయా అన్న వివరాలను నమోదు చేస్తారు. ఈ సర్వే కోసం అడవుల్లో 224 పాయింట్లను శాటిలైట్ గుర్తించింది.
దీని వివరాలు అటవీ శాఖ అధికారులకు అందించడంతో క్షేత్రస్థాయి సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం, చిత్తూరు రేంజ్‌ల పరిధిలోని బీట్లలో ఈ సర్వే చేస్తున్నారు. పశ్చిమ డీఎఫ్‌వో టి.చక్రపాణి మంగళవారం ఐరాల మండలంలోని నాంపల్లె బీటులో సాగుతున్న సర్వేను పరిశీలించారు.
అటవీ అభివృద్ధి కోసం సమగ్ర సర్వే
Published Wed, Apr 27 2016 4:21 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM
Advertisement