పెద్దపల్లి: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని, ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌ను ఓడించి తీరుతామని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు స్పష్టం చేశారు. టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన ఆయన తొలిసారిగా శనివారం పెద్దపల్లికి వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఘనంగా స్వాగతం పలికారు. బైక్ ర్యాలీ అనంతరం స్థానిక ఎంబీగార్డెన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీకి పెద్దపల్లి కంచుకోట అని, రెండుపార్టీల్లోని నాయకులందరినీ ఏకం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగురవేస్తామని తెలిపారు.
ఇందుకోసం పార్టీ కార్యకర్తలు, నాయకులను తానే స్వయంగా ఇంటింటికీ వెళ్లి కలుస్తానన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకొచ్చినప్పటినుంచి పెద్దపల్లిలో ఎలాంటి అభివృద్ధీ జరగలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి నియోజకవర్గానికి పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన నిధుల హామీలు నెరవేరలేదని విమర్శించారు. పార్టీ జిల్లా అధికార ప్రతిని«ధి దన్నాయక దామోదర్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి విజయరమణ చేరికతో పెద్దపల్లిలో మంచిరోజులు వచ్చాయన్నారు.
ఇప్పటివరకు బలమైన నాయకుడు లేక కార్యకర్తలు అయోమయంలో పడ్డారని, ఇకపై విజయ్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. అంతకుముందు పెద్దకల్వల నుంచి విజయరమణారావును నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. వారితో కలిసి పట్టణంలో మోటార్‌సైకిల్ ర్యాలీతో ఊరేగింపుగా సమావేశమందిరానికి చేరుకున్నారు. నాయకులు నూగిళ్ల మల్లయ్య, సాయిరి మహేందర్, ఎలువాక వెంకటస్వామి, అబ్బయ్య గౌడ్, నన్ను, బొడ్డుపెల్లి శ్రీనివాస్, వంగల తిరుపతిరెడ్డి, శంకర్, బూతగడ్డ సంపత్, కళ్ళేపల్లి జాని, రవి, రంగుశ్రీనివాస్, కుమార్ కిషోర్ పాల్గొన్నారు.
పెద్దపల్లికి పూర్వ వైభవం తెస్తా..
సుల్తానాబాద్(పెద్దపల్లి): పెద్దపల్లికి పూర్వవైభవం తీసుకొస్తానని విజయరమణారావు అన్నారు. ఆయన చేపట్టిన బైక్‌ర్యాలీ మండలకేంద్రం మీదుగా సాగింది. ఈ సందర్భంగా నెహ్రూ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అన్నయ్యగౌడ్, మండల అధ్యక్షుడు ముత్యం రమేష్‌గౌడ్, స్రవంతిరావు, రజిత, మనేమ్మ, అంజలి, డీసీఎంఎస్ డైరెక్టర్ కల్లెపల్లి జాని, సాయిరి మహేందర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment