జిల్లాలోని ఎల్ కోట మండలం వీరభద్రపేట సమీపంలో పొట్టేల పందెలపై పోలీసులు దాడులు జరిపారు.
విజయనగరం: జిల్లాలోని ఎల్ కోట మండలం వీరభద్రపేట సమీపంలో పొట్టేల పందెలపై పోలీసులు దాడులు జరిపారు. అందిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దాడులు జరిపి పొట్టేల పందెలను అడ్డుకున్నారు. పందెలు నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1500 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.