sheep competitions
-
ఢీ అంటే ఢీ: ఆకట్టుకున్న పొట్టేళ్ల పోటీలు
సాక్షి, పగిడ్యాల: ఉగాది పండుగను పురస్కరించుకుని పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామంలో బుధవారం నిర్వహించిన పొట్టేళ్ల పోటీలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఫైనల్లో దామగట్ల జాకీర్ పొట్టేలు, పడమర ప్రాతకోట కాశీశ్వర యూత్ పొట్టేలు తలపడగా.. దామగట్ల పొట్టేలు విజేతగా నిలిచింది. దీని యాజమానితో పాటు వరుసగా ఐదు స్థానాల్లో నిలిచిన పొట్టేళ్ల యజమానులకు నందికొట్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ తువ్వా శివరామకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ రమేష్‌నాయుడు వెండి మెడల్స్, నగదు బహుమతులు అందజేశారు. చదవండి: విషాదం: మూడేళ్లకే ముగిసిన కథ! ప్రేమను గెలిపించిన పిడకల సమరం -
ఇదేం తలనొప్పి.. ఒక్కో పొట్టేలుకు ఒక్కో కానిస్టేబుల్ కాపలా
సాక్షి, బంజారాహిల్స్: అవి అసలే పోటీ పొట్టేళ్లు.. ఒక్కోదాని బరువు 60 కేజీల పైనే.. ఒక్కోసారి అవి ఆరడుగుల మనిషిని కూడా లేపి అవతల పారేస్తాయ్. ఇలాంటి పొట్టేళ్లతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హకీంపేట్‌లో శుక్రవారం అక్రమంగా పోటీలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు పొట్టేళ్లను అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ పొట్టేళ్లను అదుపుచేయడం మాత్రం పోలీసులకు తలనొప్పిగా మారింది. పొట్టేళ్లను పోలీస్ స్టేషన్‌లోనేమో పెట్టలేరు.. బండికి కట్టేసినా తెంచుకొని పోతాయి. ఈ నేపథ్యంలో అష్టకష్టాలు పడిన పోలీసులు ఎలాగోలా వీటిని స్టేషన్ వెనుక ఉన్న సిమెంటు బల్లలకు కట్టేసి ఒక్కో పొట్టేలు వద్ద ఒక్కో కానిస్టేబుల్‌ను కాపలా పెట్టారు. వీటిని వెటర్నరీ హాస్పిటల్లో అప్పగించేంత వరకు పోలీసులకు తలప్రాణం తోకలోకి వచ్చింది. అన్నట్లు ఇందులో ఒకదానిపేరు వీర్.. మరోదాని పేరు మాలిక్. 15 మంది నిర్వాహకులను అరెస్ట్ చేసి..వీరి వద్ద నుంచి 60 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
పొట్టేల పందేలపై పోలీసుల దాడి, నలుగురి అరెస్ట్
విజయనగరం: జిల్లాలోని ఎల్ కోట మండలం వీరభద్రపేట సమీపంలో పొట్టేల పందెలపై పోలీసులు దాడులు జరిపారు. అందిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దాడులు జరిపి పొట్టేల పందెలను అడ్డుకున్నారు. పందెలు నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1500 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.