విద్యారణ్యపురి, న్యూస్‌లైన్
నకిలీ బధిర సర్టిఫికెట్లతో వివిధ డీఎస్సీల్లో పలువురు ఉపాధ్యాయులుగా నియామకమైన వ్యవహారంలో మరో నాలుగు వికెట్లు పడ్డారుు. ఈ బాగోతంలో బాధ్యులైన విద్యాశాఖలోని నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. అంతేకాదు... జిల్లా విద్యాశాఖాధికారులుగా గతంలో పనిచేసిన ముగ్గురి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు కలెక్టర్ కిషన్ లేఖ రాయడం విద్యాశాఖలో కలకలం సృష్టిస్తోంది. జిల్లాలో 2002 నుంచి 2012 వరకు నిర్వహించిన వివిధ డీఎస్సీల్లో పలువురు నకిలీ బధిర సర్టిఫికెట్లతో ఉపాధ్యాయులుగా నియామకమైన ఉదంతం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంపై జిల్లా విద్యాశాఖ పరిధిలో డీఆర్‌డీఏ పీడీ విజయగోపాల్‌ను విచారణాధికారిగా నియమించారు. ఎవరెవరు నకిలీ సర్టిఫికెట్లతో ఉపాధ్యాయులుగా నియమితులయ్యూరో విచారణలో తేలింది. దీంతో జిల్లా విద్యాశాఖలో పనిచేసే ఆ సెక్షన్‌లోని ఉద్యోగులను వేరే చోటకు పంపించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని విచారణాధికారి విజయగోపాల్ గతంలోనే సూచించినప్పటికీ... గతంలోని విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదు. అరుుతే ఈ మేరకు 17మంది ఉపాధ్యాయులపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేయగా... అందులో ఇద్దరు అరెస్టయ్యూరు. మిగతా వారు ముందుస్తు బెయిల్ తీసుకోగా... నకిలీ బధిర సర్టిఫికెట్ల సూత్రధారి బి.రమేష్‌ను ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద బ్యాంకు డిపాజిట్లు, బంగారం స్వాధీనం చేసుకోవడంతోపాటు కీలక ఆధారాలను సేకరించారు.
ఈ క్రమంలో జిల్లా విద్యాశాఖలోని పలువురు ఉద్యోగులకు కూడా సంబంధం ఉందనే అరోపణలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని డీఎస్సీ సెక్షన్‌లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఫకృద్దీన్, డిప్యూటీ డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ జగదీశ్వర్‌ను ఆర్‌వీఎంకు, డీఈఓ కార్యాలయంలో ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్ సూపరింటెండెంట్ నయీమొద్దీన్‌ను ఆర్‌ఎంఎస్‌ఏకు డిప్యూటేషన్‌పై పంపుతూ ప్రస్తుత డీఈఓ డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ వ్యవహారంపై విమర్శలు రావడంతో కలెక్టర్ జి.కిషన్ పరిశీలించారు. గత విచారణ నివేదిక ఆధారంగా ప్రస్తుత డీఈఓ నుంచి రిపోర్ట్‌ను తెప్పించుకున్నారు. నకిలీ బధిర సర్టిఫికెట్లతో ఉపాధ్యాయులుగా పలువురు నియామకమైన వ్యవహారంలో అప్పటి జిల్లా విద్యాశాఖలో పనిచేసిన డీఈఓలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనే లేఖతోపాటు బాధ్యులైన సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లపై సస్పెన్షన్ వేటు వేయాలని ఆయన ఆదేశించారు.
ఈ మేరకు ఫకృద్దీన్, జగదీశ్వర్ ను సస్పెండ్ చేస్తూ డీఈఓ... నయీమొద్దీన్‌తోపాటు గతంలో డీఈఓ కార్యాలయంలో పనిచేసి ప్రస్తుతం ఖమ్మం డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కేవీఎస్‌ఎస్‌ఎన్‌ఎస్‌ఆర్ మూర్తిని సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ వై.బాలయ్య ఉత్తర్వులు జారీచేశారు. ఆయా సెక్షన్లలో విధులు నిర్వర్తించిన సదరు ఉద్యోగులు సరిగా పరిశీలన చేయలేదని, అందుకు బాధ్యులుగా చేస్తూ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు.అదేవిధంగా కమిటీలో ప్రధాన బాధ్యులుగా ఉన్న అప్పటి జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖాధికారులుగా పనిచేసిన పుష్పరాజ్, లక్ష్మారెడ్డి, డీఈఓగా పనిచేసిన రమేష్‌బాబు, డీఈఓ కార్యాలయంలో ప్రస్తుతం అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న వెంకటరమణపై క్రమశిక్షణ చ ర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు కలెక్టర్ లేఖ రాశారు. గతంలో ఇక్కడ ఇన్‌చార్జ్ డీఈఓగా ఉన్న పుష్పరాజ్ ప్రస్తుతం కడపలో పనిచేస్తుండగా, లక్ష్మారెడ్డి ఇటీవలే ఉద్యోగ విరమణ పొందారు. రమేష్‌బాబు హన్మకొండ ప్రభుత్వ బీఈడీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. కొంత కాలం క్రితం బదిలీ అయిన మూర్తి ఖమ్మం డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
మరో నాలుగు వికెట్లు
Published Mon, Sep 9 2013 4:01 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
Advertisement
Advertisement