
నాలుగేళ్లకే 25 కిలోలు!
బాలబీముడిలా కనిపిస్తున్న ఈ చిన్నారి పేరు సవర ఫల్గుణరావు. కుడ్డపల్లి పంచాయతీ అంటికొండపెద్దగూడ గ్రామానికి చెందిన సవర మహేష్, మీనాకుమారిలో మూడో సంతానం.
సీతంపేట : బాలబీముడిలా కనిపిస్తున్న ఈ చిన్నారి పేరు సవర ఫల్గుణరావు. కుడ్డపల్లి పంచాయతీ అంటికొండపెద్దగూడ గ్రామానికి చెందిన సవర మహేష్, మీనాకుమారిలో మూడో సంతానం. పుట్టిన ప్పుడు సాధరణంగా కిలోన్నర బరువున్న ఈ చిన్నారి నాలుగేళ్ల ప్రాయం వచ్చేసరికి 25 కిలోలకు చేరడంతో గిరిజనులైన ఆ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇద్దరు మగ సంతానం పుట్టి చనిపోయిన తర్వాత 2010 సెప్టెంబరులో ఫల్గుణరావు జన్మించాడని, రోజురోజుకూ బరువు పెరుగుతుండడంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాడని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు పూటలా పెద్దవాళ్ల మాదిరిగానే అన్నం తింటాడని.. ఎప్పుడు పడితే అప్పుడు ఆకలిగా ఉంటోందని చెబుతుంటాడని.. కొద్ది దూరం కూడా నడవడానికి ఇబ్బంది పడుతున్నాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్దామన్నా తమ వద్ద చిల్లిగవ్వయినా లేదని.. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని వారు కోరుతున్నారు.